న్యూస్ స్పెషల్

ఈ TRP రేటింగ్ ఏంటి సామి…మెంటల్ మాస్ అసలు!!

కొన్ని సినిమాలు వెండి తెరపై అద్బుతంగా కలెక్షన్స్ ని సాధిస్తాయి కానీ బుల్లి తెరపై వచ్చే సరికి అనుకున్న రేంజ్ లో TRP రేటింగ్ లను సొంతం చేసుకోవడం లో మాత్రం విఫలం అవుతూ ఉంటాయి, ఇక మరి కొన్ని సినిమాలు వెండితెర పై ఫెయిల్ అయినా కానీ బుల్లితెర పై మాత్రం ప్రదర్శింపిన ప్రతీ సారి మంచి TRP రేటింగ్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతాయి. ఇక….

అతి తక్కువ సినిమాలు మాత్రమె అటు వెండి తెరపై ఇటు బుల్లి తెరపై కూడా ఆకట్టుకుంటాయి. ఇప్పుడు ఆ కోవ లోకే వస్తుంది బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ లో మొదటి క్లీన్ హిట్ మూవీ రాక్షసుడు సినిమా. తమిళ్ రీమేక్ అయినా కానీ తెలుగు లో ఆ మ్యాజిక్ ని…

రీ క్రియేట్ చేసిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకోగా తర్వాత రీసెంట్ గా బుల్లితెర పై టెలికాస్ట్ అయిన సమయం లో మొదటి సారి TRP రేటింగ్ 10.1 వరకు వచ్చి సూపర్ సక్సెస్ అయింది. ఇక రెండో సారి టెలికాస్ట్ అయినప్పుడు 7.32 TRP రేటింగ్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ హా హోల్డ్ చేసింది.

ఇక రీసెంట్ గా మూడో సారి కూడా టెలికాస్ట్ అయిన ఈ సినిమా రెండో సారి ని కూడా మించి TRP రేటింగ్ దక్కడం విశేషం. మూడో సారి 7.6 TRP రేటింగ్ ని సొంతం చేసుకున్న సినిమా సూపర్ స్ట్రాంగ్ గా హోల్డ్ చేసి బుల్లితెర పై లాభాల పంట పండిస్తుంది.

ప్రతీ సీన్ ఎంతో ఆసక్తిని రేపెలా ఉండటం రాక్షసుడు సినిమా స్పెషాలిటీ.. విలన్ ఎవరు తన ఫ్లాష్ బ్యాక్ ఏంటి, హీరో ఎలా విలన్ ని పట్టుకున్నాడు, ఇలాంటి నేపధ్యంలో అడుగడుగునా ఆసక్తి రేపెలా ఉండే స్క్రీన్ ప్లే వలన బుల్లి తెరపై కూడా ప్రేక్షకులు సినిమా ని చూడటానికి ఇష్టపడుతున్నారు. దాంతో ఏమాత్రం డ్రాప్ కానీ TRP రేటింగ్ తో దూసుకు పోతుంది ఈ సినిమా..

Leave a Comment