న్యూస్ బాక్స్ ఆఫీస్

ఉప్పెన కలెక్షన్స్: 20.5 కోట్ల బిజినెస్…7 రోజుల్లో వచ్చింది ఇది…హ్యుమంగస్!!

బాక్స్ ఆఫీస్ దగ్గర ఉప్పెన సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ తో మొదటి వారాన్ని అత్యంత ఘనంగా ముగించింది. సినిమా తొలి వీకెండ్ ని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో ముగించగా వర్కింగ్ డేస్ ని కూడా సాలిడ్ గా స్టార్ట్ చేసింది కానీ 6 వ రోజు ఘాడి తప్పింది. ఆ ఎఫెక్ట్ 7 వ రోజు కూడా గట్టిగా ఉంటుంది అనుకున్నా కానీ సినిమా హోల్డ్ చేసి 7 వ రోజు తేరుకుని మంచి కలెక్షన్స్ తో జోరు చూపి మొదటి వారాన్ని ముగించింది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7 వ రోజు సాలిడ్ గా హోల్డ్ చేసి 1.44 కోట్ల షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుని 6 వ రోజు 1.93 కోట్లతో పోల్చితే 20% రేంజ్ లోనే డ్రాప్స్ ని సొంతం చేసుకుని సూపర్ సాలిడ్ గా హోల్డ్ చేసి రెండో వారం పై అంచనాలను పెంచింది.

ఇక సినిమా వరల్డ్ వైడ్ గా హిస్టారికల్ 60 కోట్ల గ్రాస్ మార్క్ ని కంప్లీట్ చేసుకుని ఊహకందని రికార్డ్ కొట్టింది, డెబ్యూ మూవీ తోనే ఏకంగా 60 కోట్ల గ్రాస్ మార్క్ అంటే మామూలు విషయం కాదు, మ్యూజిక్, విజయ్ సేతుపతి, హీరోయిన్ పెర్ఫార్మెన్స్ కూడా సినిమా కి బాగా ప్లస్ అయింది అని చెప్పాలి.

ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం లో సాధించిన కలెక్షన్స్ వివరాలను ఒకసారి గమనిస్తే…
👉Nizam: 11.52Cr
👉Ceeded: 5.68Cr
👉UA: 6.23Cr
👉East: 3.67Cr
👉West: 2.09Cr
👉Guntur: 2.26Cr
👉Krishna: 2.40Cr
👉Nellore: 1.28Cr
AP-TG Total:- 35.13CR(56.60Cr Gross~)
Ka+ROI – 2.08Cr Approx(Updated)
Os – 1.20Cr Approx.
Total – 38.41Cr(61.20Cr~ Gross)
ఇదీ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి వారంలో సాధించిన అల్టిమేట్ కలెక్షన్స్ లెక్కలు. సినిమా బ్రేక్ ఈవెన్ ని మొదటి వీకెండ్ లోనే పూర్తీ చేసుకుని సత్తా చాటుకుంది… టోటల్ బిజినెస్ 20.5 కోట్లు కాగా…

21 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ రన్ ని మొదలు పెట్టిన ఈ సినిమా మొదటి వారం తర్వాత టోటల్ గా 17.41 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ నుండి ఇప్పుడు డబుల్ బ్లాక్ బస్టర్ రేంజ్ కి వెళ్ళడానికి సిద్ధం అవుతుంది… ఇక రెండో వీక్ లో కొత్త సినిమాల నుండి పోటి తట్టుకుని ఎలా నిలబడుతుందో అనేది ఆసక్తి కరంగా మారింది ఇప్పుడు.

Leave a Comment