గాసిప్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

ఉప్పెన బడ్జెట్ ఎంతో తెలుసా…అందుకే నో చెప్పారా??

సమ్మర్ కానుక గా రిలీజ్ అవ్వాల్సిన సినిమా లు అన్నీ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తాయో చెప్పలేమ్, అలాగే ఇప్పుడు రిలీజ్ కి ముందు ఉన్న బజ్ కూడా లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ రీ ఓపెన్ చేశాక ఉంటుందో ఉండదో కూడా చెప్పలేం.. ఇలాంటి డౌట్ ఉన్న టైం లో నిర్మాతల కు డిజిటల్ రిలీజ్ మంచి ఆప్షన్ గానే కనిపిస్తున్నా కానీ కొందరు మాత్రమే దీనికి ఒప్పు కుంటున్నారు.

కానీ చాలా మంది మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా తమ సినిమా లను థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు, అలాంటి సినిమాల్లో సమ్మర్ రేసు లో ముందు రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఉప్పెన సినిమా కూడా ఒకటి. 2 పాటల రిలీజ్ తో మంచి హైప్ ని…

సొంతం చేసుకున్న ఈ సినిమా కి రిలీజ్ కి ముందే మంచి బజ్ ఏర్పడింది, అలాగే మెగా ఫ్యామిలీ నుండి కొత్త హీరో పంజా వైష్ణవ్ తేజ్ కూడా లాంచ్ అవుతుండటం, మంచి టేస్ట్ ఉండే ప్రొడక్షన్ హౌస్ గా పేరున్న మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండటం తో అంచనాలు డీసెంట్ గా ఉన్నాయి.

ఇక ఈ సినిమా బడ్జెట్ సుమారు 17.5 కోట్ల నుండి 18 కోట్ల రేంజ్ లో రూపొందిందని సమాచారం. డెబ్యూ హీరో కి ఇది ఎక్కువ బడ్జెట్ అనే చెప్పాలి. ఈ బడ్జెట్ వలెనే సినిమా కి రీసెంట్ గా వచ్చిన డిజిటల్ రిలీజ్ ఆఫర్ 16 కోట్ల రేంజ్ లో ఉన్నా కేవలం 2 కోట్లు తక్కువే అయినా కానీ నిర్మాతలు ఒప్పుకోలేదట.

ఈ సినిమా క్లైమాక్స్ ఇప్పటి వరకు రాని డిఫెరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిందని, అది థియేటర్స్ లోనే చూసి తీరాలని అందుకే ఎన్ని ఆఫర్స్ వచ్చినా యూనిట్ నో చెబుతుందని టాక్ ఉంది, ఇక లాక్ డౌన్ తర్వాత ఆగస్టు నుండి తిరిగి సినిమా లు రిలీజ్ అవుతాయి కాబట్టి ఈ సినిమా ఆగస్టు లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని టాక్ ఉంది.

Leave a Comment