న్యూస్

ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య TRP: అమ్మింది 2.2 కోట్లు….వచ్చింది ఇది!

OTT సూపర్ హిట్ ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య రీసెంట్ గా డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకోగా సినిమా కి మంచి టాక్ రాగా జనాలు బాగానే సినిమాను చూశారు అని చెప్పాలి. 3 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రూపొందిన సినిమా 5.5 కోట్ల రేంజ్ రేటు దక్కించుకుని డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకోగా నిర్మాతలను మంచి ప్రాఫిట్ దక్కేలా చేసిన సినిమా ఇటు కొన్న OTT కంపెనీ కి కూడా…

వ్యూస్ తో మంచి ప్రాఫిట్స్ ని సొంతం అయ్యేలా చేసిందని సమాచారం. ఇక సినిమా శాటిలైట్ రైట్స్ ని ఈ టీవీ వాళ్ళు కొన్నారు. అప్పుడెప్పుడో నాగార్జున ఓం నమో వెంకటేశాయా సినిమా ను కొని టెలికాస్ట్ చేసిన ఈ టీవీ మళ్ళీ గ్యాప్ తీసుకుని…

ఈ సినిమా శాటిలైట్ రైట్స్ హక్కులను సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమా కోసం సుమారు 2.2 కోట్ల రేంజ్ రేటు ఈ టీవీ చెల్లించినట్లు సమాచారం. ఇక రీసెంట్ గా మొదటి సారి టెలికాస్ట్ అయిన సినిమా కి మంచి రేటింగ్ దక్కింది అని చెప్పాలి. మిగిలిన టాప్ ఛానెల్స్ తో పోల్చితే…

కొత్త సినిమాలను అస్సలు వేయని ఈ టీవీ లో టెలికాస్ట్ అయినా కానీ ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమా కి 5.11 TRP రేటింగ్ దక్కిందని సమాచారం. ఇది సాలిడ్ రేటింగ్ అనే చెప్పాలి. ఛానెల్ లో సినిమాలు పెద్దగా వేయరు అన్నది ఒక రీజన్ కాగా సినిమా ను కొన్న రేటు ప్రకారం చూసుకున్నా సినిమా కి అక్కడ…

మంచి రేటింగ్ దక్కింది, కానీ సినిమా వేరే టాప్ ఛానెల్ లో టెలికాస్ట్ చేసి ఉంటె మరింత బెటర్ TRP రేటింగ్ ని సొంతం చేసుకుని ఉండేదని చెప్పాలి. ఇక సినిమా ను కొన్న రేటు కి ఛానెల్ కి ప్రాఫిట్ వచ్చిందా లేదా అన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సెకెండ్ టెలికాస్ట్ కి ఆ డీటైల్స్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పాలి.

Leave a Comment