గాసిప్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

ఊచకోత కోసిన మెగాస్టార్….ఇండస్ట్రీ రికార్డ్ బెండు తీశాడు!

10 ఏళ్ల తర్వాత వెండి తెరపై మెగా కంబ్యాక్ తో సెన్సేషనల్ 100 కోట్ల షేర్ రికార్డ్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు 151 వ సినిమా సైరా నరసింహా రెడ్డి తో మరో సంచలనం సృష్టించడానికి సిద్ధం అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. అక్టోబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా బిజినెస్ పరంగా ఇప్పటి నుండే పెను సంచలనాలను నమోదు చేస్తూ దూసుకు పోతుంది. ఇప్పుడు ఇండస్ట్రీ లో….

వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా కర్ణాటక లో ఆల్ టైం రికార్డ్ బ్రేకింగ్ బిజినెస్ ని సొంతం చేసుకుందని సమాచారం, బాహుబలి 2 తర్వాత అక్కడ ఆల్ టైం హైయెస్ట్ బిజినెస్ ని సొంతం చేసుకున్న సినిమా గా ఈ సినిమా నిలవబోతుంది అని అంటున్నారు.

ఈ సినిమాకి అక్కడ ఏకంగా 32 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగే అవకాశం ఉందని అంటున్నారు, ఫైనల్ చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే రేటు కన్ఫాం అవుతుందని చెబుతున్నారు. ఇది నిజంగానే ఆల్ టైం రికార్డ్ బిజినెస్ అని చెప్పాలి. బాహుబలి అక్కడ 36 కోట్ల బిజినెస్ ని అందుకుంది. ఆ తర్వాత ఒక్క మూవీ కూడా 30 కోట్ల బిజినెస్ ని అందుకోలేదు. ఇప్పుడు సైరా రికార్డుల బెండు తీసేలా ఉందని చెప్పొచ్చు.

Leave a Comment