న్యూస్ ప్రీ రిలీజ్ బిజినెస్ బాక్స్ ఆఫీస్

ఊరు పేరు లేని సినిమా…బాక్స్ ఆఫీస్ దగ్గర ఇన్ని కలెక్షన్స్ ఏంటి సామి!!

బాక్స్ ఆఫీస్ దగ్గర పాండమిక్ తర్వాత చాలా సినిమాలు రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతున్నాయి, చాలా వరకు చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నాయి. ఇక ఈ సినిమాలతో పోటి లో అసలు ఊరు పేరు లేని సినిమా ఒకటి మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ట్రేడ్ ని ఆశ్యర్యానికి గురి చేసింది. ఆ సినిమా నే G జాంబి…

ఈ సినిమా జాంబి రెడ్డి సినిమా కి పోటి గా రిలీజ్ అయింది, అదే రోజున రిలీజ్ అయిన ఈ సినిమా ఏమంత ఆశించిన టాక్ ని సొంతం చేసుకోక పోయినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా మాత్రం మంచి వసూళ్ళని దక్కించుకుని సత్తా చాటుకుంది..

సినిమా మొదటి వీకెండ్ లోనే బాక్స్ ఆఫీస్ దగ్గర 27 లక్షల షేర్ ని 42 లక్షల గ్రాస్ ని సొంతం చేసుకోగా సినిమా మొత్తం మీద పరుగు పూర్తీ అయ్యే టైం కి రెండు తెలుగు రాష్ట్రాలలో 40 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. జాంబి రెడ్డి, జీ జాంబి టైటిల్ కొంచం…

సేం టు సేం ఉండటం తో జనాలు ఆ సినిమా అనుకుని ఈ సినిమా కి వెళ్ళడం జరిగింది, ఆ అడ్వాంటేజ్ తో సినిమా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. మొత్తం మీద 40 లక్షల దాకా షేర్ ని 70 లక్షల దాకా గ్రాస్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా. అసలు సినిమా గురించి యూనిట్ గురించి ఎవ్వరికీ పెద్దగా టచ్ కూడా లేదు కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర..

సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇప్పుడు డిజిటల్ రిలీజ్ కూడా అయిన ఈ సినిమా జాంబి రెడ్డి పుణ్యాన మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది అని చెప్పాలి. మామూలు టైం లో రిలీజ్ అయ్యి ఉంటె చిల్లర కూడా వచ్చి ఉండదు అని చెప్పాలి. అందుకే అంటారు, సినిమా తీయడం ఒకెత్తు కరెక్ట్ టైం కి రిలీజ్ చేయడం మరో ఎత్తు అని…

Leave a Comment