న్యూస్ రివ్యూ

ఎంతమంచివాడవురా ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా-ఫట్టా!!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా శతమానం భవతి ఫేమ్ సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఎంత మంచి వాడవురా ప్రేక్షకుల ముందుకు 2020 సంక్రాంతి రేసులో చివర్లో నేడు వచ్చేసింది, టోటల్ గా 300 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ముందు గా ప్రీమియర్ షోలను పూర్తి చేసుకోగా అక్కడ నుండి ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుందో తెలుసు కుందాం పదండీ..

కథ పాయింట్ ని పూర్తిగా రివీల్ చేయలేదు కానీ కళ్యాణ్ రామ్  యాక్టర్స్ ని సప్లై చేసే కంపెనీ పెడతారు, లోన్లీ గా ఉండే ఫ్యామిలీస్ కి టెంపరరీ యాక్టర్స్ ని పంపుతారు. కళ్యాణ్ రామ్ ఓ మూడు ఫ్యామిలీస్ కి హెల్ప్ చేస్తాడు, అది ఎలా? వాళ్లకి హెల్ప్ చేయాల్సిన అవసరం ఏంటి లాంటివి సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అంటున్నారు.

ఇవి కాకుండా సినిమా మరిన్ని ఉపకథలు ఉన్నాయి… పెర్ఫార్మెన్స్ పరంగా కళ్యాణ్ రామ్ మంచి నటనతో ఆకట్టుకున్నాడట, యాక్షన్ సీన్స్ లో దుమ్ము లేపాడని అంటున్నారు. కామెడీ టచ్ తో కూడా కొద్దిగా మెప్పిస్తాడని అంటున్నారు. ఇక హీరోయిన్ మేహ్రీన్ ఉన్నంతలో ఆకట్టుకోగా..

భారీ స్టార్ కాస్ట్ కూడా ఉన్నంతలో తమ తమ రోల్స్ లో ఆకట్టుకుంటారని అంటున్నారు, ఫస్టాఫ్ వరకు కథ పడుతూ లేస్తూ సాగుతుంది, పెద్దగా ఆసక్తి కలిగించే కథ కాక పోయినా సింపుల్ గా కథ ముందుకు వెళుతుందని అంటున్నారు. ఇంటర్వెల్ సీన్ బాగుండగా..

సెకెండ్ ఆఫ్ కథ పాయింట్ బాగానే మొదలు అయినా తిరిగి మళ్ళీ స్లో డౌన్ అవుతూ సాగుతూ ఉంటుంది, అక్కడక్కడా కొన్ని సీన్స్ బాగుండగా ఓవరాల్ గా స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్ అనుకున్న రేంజ్ లో లేదని అంటున్నారు. సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపించే విధంగా ఉన్నాయని అంటున్నారు.

డైరెక్షన్ పరంగా సతీష్ వేగేశ్న డిఫెరెంట్ కాన్సెప్ట్ ని ట్రై చేసినా అది సరిగ్గా తెరకెక్కించ లేక పోయాడని అంటున్నారు. ఉన్నంతలో సినిమా పర్వాలేదు అనిపించే విధంగా ఉంటుందని ఓవర్సీస్ ఆడియన్స్ చెబుతున్నారు.. ఫైనల్ గా అక్కడ నుండి టాక్.

యావరేజ్ టు ఎబో యావరేజ్ రేంజ్ లో వస్తుందని చెప్పొచ్చు. ఇక రెగ్యులర్ షోలకు సినిమా ఇక్కడ ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి. ఎబో యావరేజ్ రేంజ్ టాక్ ఇక్కడా కూడా వచ్చినా మిగిలిన సినిమాల పోటి లో ఈ సినిమా కూడా నిలబడే అవకాశం ఉంటుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో…

Leave a Comment