న్యూస్ రివ్యూ వీడియో

ఎంతమంచి వాడవురా ట్రైలర్ రివ్యూ…ప్లస్&మైనస్ పాయింట్స్!!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ “ఎంత మంచి వాడవురా” శతమానం భవతి తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కొట్టి శ్రీనివాస కళ్యాణం తో పర్వాలేదు అనిపించు కున్నా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ కొట్టని సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేశారు. ట్రైలర్ ఎలా ఉందో తెలుసు కుందాం పదండీ..

స్టొరీ పాయింట్ ఏంటి అనేది క్లియర్ గా రివీల్ కాలేదు కానీ తనకి మంచి ఇచ్చిన చెడు ఇచ్చిన తిరిగి ఇచ్చేసే అలవాటు ఉన్న హీరో తన లైఫ్ లో ఎలాంటి పరిస్థితులను ఎదురుకున్నాడు అనిపించే కాన్సెప్ట్ తో ట్రైలర్ లో చూపెట్టారు. కొంచం కన్ఫ్యూజన్ ని రేకెత్తించినా…

ఓవరాల్ గా ట్రైలర్ ఆకట్టుకుంది, కళ్యాణ్ రామ్ డైలాగ్స్ అండ్ ఫైట్స్ లో దుమ్ము లేపాడు, హీరోయిన్ మేహ్రీన్ క్యూట్ లుక్స్ తో ఆకట్టుకోగా లైట్ కామెడీ, బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపించాయి. ఓవరాల్ గా ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు కమర్షియల్ టచ్ కూడా ఉందని ట్రైలర్ రుజువు చేసింది.

మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే ఫైట్స్ అండ్ హీరోయిజం సీన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే ఎమోషనల్ సీన్స్ కొన్ని చూపెట్టి ఓవరాల్ గా ట్రైలర్ తో మంచి ఇంప్రెషన్ నే కొట్టేశారు టోటల్ టీం. కొంచం కన్ఫ్యూజన్ గా ఉండటం ఒక్కటే చిన్న మైనస్ అని చెప్పాలి. అది తప్పితే ఓవరాల్ గా ట్రైలర్ ఆకట్టుకుంది.

సంక్రాంతి బరిలో అండర్ డాగ్ గా బరిలోకి దిగుతున్న ఈ సినిమా ఇది వరకు సీజన్స్ లో అండర్ డాగ్స్ గా బరిలోకి దిగి దుమ్ము లేపిన సినిమాల సరసన చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పొచ్చు. మీరు కూడా సినిమా ట్రైలర్ చూసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.

Leave a Comment