న్యూస్ ప్రీ రిలీజ్ బిజినెస్ బాక్స్ ఆఫీస్

ఎనిమీ తెలుగు బిజినెస్ అండ్ టోటల్ థియేటర్స్ కౌంట్…క్లీన్ హిట్ టార్గెట్!

కోలివుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో విశాల్ ఒకరు, ఆర్య కి కూడా తెలుగు లో మంచి పేరు ఉంది. ఈ ఇద్దరు కలిసి వాడు వీడు సినిమా తర్వాత చేస్తున్న మరో మల్టీ స్టారర్ మూవీ ఎనిమీ… బాక్స్ ఆఫీస్ దగ్గర దీపావళి వీకెండ్ లో తమిళ్ లో రజినీ సినిమా తో తెలుగు ఆ సినిమా తో పాటు తెలుగు స్ట్రైట్ మూవీ…

మంచిరోజులొచ్చాయి తో పోటి పడబోతున్న ఈ సినిమా బిజినెస్ పరంగా బాగానే హోల్డ్ చేసి థియేటర్స్ ని కూడా బాగానే సొంతం చేసుకుంది. తమిళ్ లో సినిమా బిజినెస్ లెక్కలు ఏమి బయటికి రాలేదు కానీ తెలుగు లో సినిమా టోటల్ గా ఆంధ్ర ప్రదేశ్ లో…..

2.7 కోట్ల బిజినెస్ ను అందుకుంటే నైజాం ఏరియాలో 1.8 కోట్ల మేర బిజినెస్ ను సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 4.5 కోట్ల బిజినెస్ ను సాధించగా బ్రేక్ ఈవెన్ కోసం మొత్తం మీద 5 కోట్ల మేర షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది బాక్స్ ఆఫీస్ దగ్గర…

ఇక ఈ సినిమా నైజాం ఏరియాలో 112 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుండగా సీడెడ్ ఏరియాలో 65 థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇక ఆంధ్ర ఏరియాలో 150 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుండగా రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 330 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. తమిళనాడులో 240 థియేటర్స్ లో రిలీజ్ కానుందని అంటున్నారు.

సినిమాకి ప్రజెంట్ అయితే తెలుగు లో పెద్దగా బజ్ ఏమి లేదనే చెప్పాలి కానీ ఒక్కసారి సినిమా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటే కలెక్షన్స్ పరంగా లాంగ్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుని ఈ కలెక్షన్స్ ని రికవరీ చేస్తుందో చూడాలి.

Leave a Comment