న్యూస్ బాక్స్ ఆఫీస్

ఎనిమీ 2 డేస్ టోటల్ కలెక్షన్స్…. ఏంటి సామి ఇది!

విశాల్ ఆర్యల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఎనిమీ రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు రాగా తమిళ్ లో రజినీ అన్నట్టే సినిమాతో తెలుగు లో కూడా పోటిలో రిలీజ్ అవ్వగా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా అంచనాలను మించి వసూళ్ళని సొంతం చేసుకున్న ఈ సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం అంచనాలను మించలేదు సరికదా అంచనాలకు తగ్గట్లు కలెక్షన్స్ ని కూడా అందుకోలేక పోయింది…

రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 55-60 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అనుకుంటే సినిమా కేవలం 40 లక్షల రేంజ్ షేర్ తోనే సరిపెట్టుకుంది. మొత్తం మీద సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 2 రోజుల్లో తెలుగు లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….

👉Nizam: 50L
👉Ceeded: 25L
👉UA: 16L
👉East: 12L
👉West: 9L
👉Guntur: 15L
👉Krishna: 8L
👉Nellore: 7L
AP-TG Total:- 1.42CR(2.25CR~ Gross)
సినిమా తెలుగు బిజినెస్ 4.5 కోట్లు కాగా బ్రేక్ ఈవెన్ కోసం 5 కోట్లు అందుకోవాల్సి ఉండగా 2 రోజుల తర్వాత ఇంకా 3.58 కోట్ల షేర్ దూరంలో ఉంది ఈ సినిమా…

ఇక తమిళ్ లో మొదటి రోజు కన్నా రెండో రోజు గ్రోత్ చూపెట్టగా 2 రోజుల్లో అక్కడ 5.5 కోట్ల గ్రాస్ ను, రెస్ట్ ఆఫ్ ఇండియాలో తెలుగు డబ్ కాకుండా 1.7 కోట్ల గ్రాస్ ను అందుకోగా ఓవర్సీస్ మొత్తం మీద 3.1 కోట్ల గ్రాస్ ను సాధించింది, దాంతో 2 డేస్ లో టోటల్ వరల్డ్ వైడ్ గా 12.55 కోట్ల గ్రాస్ ను మరియు…

6.2 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా, తమిళ్ వర్షన్ బిజినెస్ లెక్కలు ఏమి ఇంకా బయటికి రాలేదు, ఓవరాల్ గా సినిమా తమిళ్ వరకు 2 డేస్ లో డీసెంట్ గానే ఉన్నప్పటికీ తెలుగు లో అంచనాలను తప్పుతుంది, ఇక మూడోరోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి ఇక.

Leave a Comment