న్యూస్

ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు…2nd వీక్ ప్రతీ రోజు ఎంత TRP రేటింగ్ వచ్చిందంటే!!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ టెలివిజన్ కి ఆల్ మోస్ట్ 4 ఏళ్ల గ్యాప్ తర్వాత తిరిగి కంబ్యాక్ ఇవ్వగా కంబ్యాక్ లో ఆల్ రెడీ లోవెస్ట్ రేటింగ్ లను సొంతం చేసుకున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో ని హోస్ట్ చేయాలని డిసైడ్ అయిన ఎన్టీఆర్ ఈ షో ని రీసెంట్ గా మొదలు పెట్టగా మొదటి వారం లో సూపర్ సక్సెస్ అయిన ఈ షో మంచి రేటింగ్ లను…

సొంతం చేసుకుని దుమ్ము లేపింది… మొదటి వారం లాంచ్ ఎపిసోడ్ కి సాలిడ్ రేటింగ్ రావడం తో ఓవరాల్ గా ఆ వీక్ కి యావరేజ్ గా 6.72 రేటింగ్ దక్కగా రెండో వారం సెలబ్రిటీలు లాంటి వారు ఎవరూ లేకున్నా కానీ ఓవరాల్ గా రేటింగ్ లు యావరేజ్ గా…

6.48 రేటింగ్ సొంతం చేసుకుంది. ఫస్ట్ వీక్ వర్కింగ్ డేస్ రేటింగ్ 5.62 వరకు వచ్చింది, సెకెండ్ వీక్ మొత్తం వర్కింగ్ డేస్ అయినా 6.48 రేటింగ్ రావడం విశేషం అని చెప్పాలి… ఇక ఓవరాల్ గా రెండో వారం లో వచ్చిన 4 ఎపిసోడ్స్ కి రోజు వారి రేటింగ్ ఎంతవరకు వచ్చాయి అన్నది ఆసక్తిగా మారగా….

సోమవారం ఎపిసోడ్ కి 8.05 రేటింగ్ రాగా మంగళవారం ఎపిసోడ్ కి 6.3 రేటింగ్ బుధవారం ఎపిసోడ్ కి 5.81 రేటింగ్ ఇక గురువారం ఎపిసోడ్ కి 5.74 రేటింగ్ సొంతం అయ్యాయి …. ఇలా వర్కింగ్ డేస్ లో మంచి రేటింగ్ లను సొంతం చేసుకుని ప్రతీ రోజు బాగా హోల్డ్ చేసిన ఈ షో రెండో వారం మొత్తం మీద యావరేజ్ గా 6.48 రేటింగ్ తో బాగా హోల్డ్ చేసింది.

మొదటి వారం తో పోల్చితే రెండో వారం జెమినీ టీవీ రేటింగ్ లు కూడా సూపర్ సాలిడ్ గా గ్రోత్ ని సొంతం చేసుకున్నాయి కానీ షోల విషయం లో ఇప్పటికీ స్టార్ మా ఛానెల్ టాప్ లో కొనసాగుతూ ఉండటంతో జెమినీ టీవీ రానున్న వారాల్లో మరింత పుంజుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మూడో వారం లో ఈ షో కి ఎలాంటి రేటింగ్ లు దక్కుతాయి అనేది ఆసక్తిగా మారింది.

Leave a Comment