న్యూస్

ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు…3rd వీక్ ప్రతీ రోజు ఎంత TRP రేటింగ్ వచ్చిందంటే!!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 1 తర్వాత ఆల్ మోస్ట్ 4 ఏళ్ళు గ్యాప్ తీసుకుని తిరిగి రీ ఎంట్రీ ఇచ్చిన ఎవరు మీలో కోటీశ్వరులు షో తిరిగి మంచి రేటింగ్ లతో దూసుకు పోతుంది, పాత సీజన్స్ రేటింగ్ లు పాతాళానికి పడిపోగా ఎన్టీఆర్ తో హోస్ట్ చేయించిన ఈ షో వారం వారం ఇంప్రూవ్ మెంట్ తో దూసుకు పోతుంది. మొదటి వారం వర్కింగ్ డేస్ లో 5.62 రేటింగ్ ను…

సొంతం చేసుకోగా రెండో వారానికి వచ్చే సరికి 6.48 రేటింగ్ తో దుమ్ము లేపే రేంజ్ లో గ్రోత్ ని సొంతం చేసుకుంది. ఇక రీసెంట్ గా మూడో వారానికి గాను ఈ షో ఇంకా జోరు పెంచి ఏకంగా 7.3 రేటింగ్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించగా ఓవరాల్ గా 3 వ వారంలో ప్రతీ రోజు ఎంతెంత రేటింగ్ ను…

ఈ షో సొంతం చేసుకుంది అన్నది ఆసక్తిగా మారగా సోమవారం ఎపిసోడ్ కి 7.04 రేటింగ్ రాగా, మంగళవారం ఎపిసోడ్ కి 7.52 రేటింగ్ సొంతం అయ్యింది, ఇక బుదవారం ఎపిసోడ్ కి ఏకంగా 7.99 రేటింగ్ రాగా గురువారం కొంచం తగ్గి 6.01 రేటింగ్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా ఆ వీక్ యావరేజ్ గా 7.3 రేటింగ్ తో అద్బుతంగా హోల్డ్ చేసింది. ఇక 4 వ వారం రేటింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Leave a Comment