గాసిప్స్ న్యూస్

ఎన్టీఆర్ కూడా సిద్ధం…ఫస్ట్ సినిమా ఏంటో మరి??

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ హీరోలందరి కన్నా ఫుల్ జోష్ మీదున్న హీరో గా చెప్పుకోవాలి, గత 5 సినిమాలుగా ఒక్క అపజయం కూడా లేకుండా దూసుకు పోతున్న ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ తో కలిసి చేస్తున్న సెన్సేషనల్ మూవీ ఆర్.ఆర్.ఆర్ తో ఫుల్ బిజీ గా ఉన్న విషయం తెలిసిందే, శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

కాగా ఈ సినిమా తర్వాత వరుసగా కొన్ని సినిమాలను ఒప్పుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు కొత్త అవతారం ఎత్తబోతున్నాడు అంటూ ఇండస్ట్రీ లో చర్చలు గట్టిగానే సాగుతున్నాయి. టాలీవుడ్ లో ఉన్న చాలా మంది హీరోలు ఇప్పటికే ఓన్ గా సినిమాలను నిర్మిస్తుండటం మొదలు పెట్టిన విషయం తెలిసిందే.

టాప్ స్టార్స్ నుండి యంగ్ హీరోల్లో కూడా సినిమాలను నిర్మిస్తున్నారు. కాగా ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నిర్మాతగా మారి ఓన్ బ్యానర్ పెట్టబోతున్నాడు అంటూ ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తుండగా అది నిజం అయ్యే అవకాశం లేదని చెప్పే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు.

కళ్యాణ్ రామ్ కి ఆల్ రెడీ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ఉండగా ఎన్టీఆర్ ఆ బ్యానర్ లోనే సినిమాను నిర్మిస్తారని స్వంతంగా మరో బ్యానర్ పెట్టె అవకాశం తక్కువే అని అంటున్నారు. కానీ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ లోనే సినిమాను నిర్మించే అవకాశం ఎక్కువగా ఉందని టాక్ వినిపిస్తుంది.

ఆ లెక్కన తన నిర్మాణం లో ఎన్టీఆర్ ఆర్ట్స్ లో నిర్మించే సినిమా ఏది అవుతుందా అన్నది ఆసక్తిగా మారింది అని చెప్పొచ్చు.  కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ లో ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ సినిమా నిర్మించబోతున్నారు అన్నది చాలా రోజులుగా ఉన్న టాక్. ఎన్టీఆర్ కూడా అందులో పాలు పంచుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!