గాసిప్స్ న్యూస్

ఎన్టీఆర్ కొరటాల శివ ల సినిమా బడ్జెట్…ఇన్ని కోట్లా…మాస్ భీభత్సం ఇది!!

అరవింద సమేత సినిమా తర్వాత ఫుల్ టైం ని ఆర్ ఆర్ ఆర్ కోసమే కేటాయించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ సినిమా కోసం ఇప్పటికే 3 ఏళ్లని కేటాయించగా త్వరలోనే సినిమా ను పూర్తీ చేసి కొత్త సినిమాలను కమిట్ అవుతున్న ఎన్టీఆర్ ఈ సినిమా అయిన వెంటనే చేస్తున్న అప్ కమింగ్ మూవీ ముందు త్రివిక్రమ్ తో అనుకున్నా కొన్ని కారణాల వలన అది పోస్ట్ పోన్ అవ్వగా ఆ ప్లేస్ లో….

కొరటాల శివ డైరెక్షన్ లో సినిమాను కమిట్ అయిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా ను ఏకంగా పాన్ ఇండియా లెవల్ లో రూపొందించాలని ఫిక్స్ అయిన మేకర్స్ భారీ లెవల్ లో ఈ సినిమాను రూపొందించడానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని….

ఆల్ రెడీ మొదలు పెట్టారని ఇప్పుడు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తూ ఉండగా సినిమా కోసం మమ్మోత్ బడ్జెట్ ని కూడా పెట్టబోతున్నారని అంటున్నారు. కొరటాల ట్రాక్ రికార్డ్ అద్బుతంగా ఉన్న నేపధ్యంలో ఎన్టీఆర్ కూడా ఆర్ ఆర్ ఆర్ పాన్ ఇండియా లెవల్ లో పేరును క్రేజ్ ని సొంతం చేసుకునే….

అవకాశం ఎంతైనా ఉన్న నేపధ్యంలో ఈ సినిమా కోసం ఏకంగా 200 కోట్ల భారీ బడ్జెట్ ని పెట్టబోతున్నారని అంటున్నారు. ఇది వరకు త్రివిక్రమ్ తో సినిమా కి కూడా ఫస్ట్ అనుకున్న సబ్జెక్ట్ కి ఇలాంటి బడ్జెట్ నే అనుకున్నారు కానీ సినిమా పోస్ట్ పోన్ అవ్వడం తో వీళ్ళ కాంబినేషన్ సెట్ అవ్వగా వీళ్ళ కాంబోలో సినిమా కి కూడా ఈ రేంజ్ బడ్జెట్ అంటే మాత్రం…

సినిమా ఏ రేంజ్ లో తెరకెక్కించబోతున్నారో గ్రాండియర్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అన్నది ఆసక్తి గా మారింది ఇప్పుడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు అవుతుందని అంటున్నారు. అప్పుడు సినిమా కాస్ట్ అండ్ క్రూ ని కూడా అనౌన్స్ చేస్తారని సమాచారం. ఈ సినిమా తో ఎన్టీఆర్ ఏ రేంజ్ రచ్చ చేస్తాడో చూడాలి ఇక.

 

Leave a Comment