గాసిప్స్ న్యూస్

ఎన్టీఆర్ తో KGF డైరెక్టర్ సినిమా…మండి పడుతున్న కన్నడిగులు…రీజన్ ఇదే!!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే రీసెంట్ గా జరిగిన విషయం తెలిసిందే, ఈ సందర్భంగా తన అప్ కమింగ్ సినిమాల అనౌన్స్ మెంట్ లు ఒకటి తర్వాత ఒకటి వస్తాయి అనుకున్నా అవేమి జరగలేదు కానీ డౌట్ గా ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ మాత్రం అఫీషియల్ గా అనౌన్స్ అయింది. అదే ఎన్టీఆర్ మరియు KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ల కాంబినేషన్. ఈ కాంబినేషన్ పై గత కొంత కాలంగా…

వార్తలు ప్రచారం లో ఉన్నప్పటికీ అఫీషియల్ గా మాత్రం ఎన్టీఆర్ బర్త్ డే రోజున డైరెక్టర్ ప్రశాంత్ నీల్ విషెస్ చెబుతూ ట్వీట్ చేయడం తో కన్ఫాం అయింది, దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది, ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత….

త్రివిక్రమ్ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ తో ఊరమాస్ సినిమాలు కమిట్ అయ్యాయని హ్యాప్పీ గా ఉండగా సోషల్ మీడియా లో సడెన్ గా మరో ట్రెండ్ జరుగుతుంది, అది కన్నడ ఆడియన్స్ కొందరు ప్రశాంత్ నీల్ పై చేస్తున్న నెగటివ్ ట్రెండ్.. సౌత్ లో మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చితే…

తక్కువ మార్కెట్ ఉన్న ఏరియా గా కర్ణాటకని చెప్పుకుంటారు, ప్రతీ ఇండస్ట్రీ మూవీ కూడా ఇక్కడ భారీ ఎత్తున రిలీజ్ అవుతుండటం తో ఓన్ ఇండస్ట్రీకి అన్యాయం జరుగుతుందని ఎప్పటి నుండో వాళ్ళు కోపంగా ఉన్న టైం లో KGF తో కన్నడ ఇండస్ట్రీ గురించి నేషనల్ వైడ్ గా ఇంటర్నేషనల్ లెవల్ కి తీసుకెళ్ళాడని ప్రశాంత్ నీల్ ని ఓ రేంజ్ లో పొగిడే వారు వారందరూ.

కానీ ఇప్పుడు భారీ రెమ్యునరేషన్ కోసం కన్నడ ఇండస్ట్రీని వదిలి వేరే ఇండస్ట్రీలో సినిమా చేయడానికి ఒప్పుకోవడం తో “గెట్ లాస్ట్ ప్రశాంత్ నీల్” అంటూ ట్విట్టర్ లో ట్రెండ్ చేయడం మొదలు పెట్టారు, ఇది ప్రశాంత్ నీల్ దాకా వెళ్ళగా… నా రక్తంలో ఉంది కూడా కన్నడ పౌరుషమే, తన సినిమాలు అన్ని కన్నడలోనే ఉంటాయి అంటూ చెప్పుకొచ్చాడట, దాంతో ఇష్యూ కొద్దిగా సద్దుమనిగిందని అంటున్నారు ఇప్పటికీ..

Leave a Comment