గాసిప్స్ న్యూస్

ఎన్టీఆర్ ప్రశ్నలు…రామ్ చరణ్ జవాబులు…రికార్డులు బద్దలవ్వడం ఖాయం!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సెన్సేషనల్ మల్టీ స్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్ కోసం ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూపులు చూస్తున్న విషయం తెలిసిందే. ఆడియన్స్ ముందుకు అక్టోబర్ 13 న రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ పనులను రీసెంట్ గా మొదలు పెట్టారు మేకర్స్.. అవి పీక్ స్టేజ్ కి ఎప్పుడు వెళతాయి అన్నది…

ఇంకా తేలాల్సి ఉండగా ఎక్కువ మంది జనాలను ఆల్ రెడీ సినిమా రీచ్ అయినా కానీ ఫ్యామిలీస్ కి మరింత ఎక్కువగా సినిమా రీచ్ అవ్వడం కోసం సినిమా కి వినూత్న రీతిలో ప్రచారం చేయాలనీ మేకర్స్ భావిస్తున్నారు. ఇందుకు గాను ఇప్పుడు ఎన్టీఆర్ త్వరలోనే…

టెలివిజన్ లో బిగ్ బాస్ తర్వాత హోస్ట్ చేయబోతున్న కొత్త షో ఎవరు మీలో కోటీశ్వరుడు జెమినీ టీవీ లో త్వరలో నే మొదలు కాబోతుంది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ టీం ని మొదటగా ఈ షో కి ఛీఫ్ గెస్టులుగా పిలవబోతున్నారని తెలుస్తుంది. అందులో కూడా మొదటి గెస్ట్ గా…

రామ్ చరణ్ ఈ షోలో పాల్గొన బోతున్నారని, రామరాజు మరియు కొమరం భీమ్ ల పరిచయం ఇక్కడి నుండే మొదలు అవుతుందని ప్రస్తుతం చెబుతున్నారు. ఈ షోలో ఎన్టీఆర్ ప్రశ్నలకు రామ్ చరణ్ జవాబులు ఉండబోతున్నాయని… దాంతో ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ మరో లెవల్ కి వెళ్ళే అవకాశం ఉండటం తో పాటు… షోకి కూడా అద్బుతమైన స్టార్ట్ లభించడం…

అదిరి పోయే రికార్డ్ TRP రేటింగ్ లు రావడం ఖాయమని అంటున్నారు. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతుందని సమాచారం. ఆర్ ఆర్ ఆర్ పై ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా ఈ ప్రమోషన్స్ తో క్రేజ్ మరింత భారీగా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

Leave a Comment