గాసిప్స్ న్యూస్

ఎన్టీఆర్-మోహన్ లాల్…2 సినిమాలు…ఇదీ అసలు నిజం!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన రీసెంట్ మూవీస్ అన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపినవే. ఇక అన్ని సినిమాల్లో కొంచం స్పెషల్ మూవీ గా చెప్పుకునేది ఎన్టీఆర్ మరియు మోహన్ లాల్ ల కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ మూవీ. ఎన్టీఆర్ కి సరైన టైం లో పడ్డ బ్లాక్ బస్టర్ హిట్ ఈ సినిమా. ఆ టైం లో ఎన్టీఆర్ మోహన్ లాల్ ల కాంబినేషన్ కు…

అద్బుతమైన క్రేజ్ ఏర్పడింది. దాంతో అడపాదడపా ఎన్టీఆర్ నటించే సినిమాల్లో మోహన్ లాల్ కీలక పాత్ర చేయబోతున్నాడు అంటూ వార్తలు శిఖారు చేశాయి. ఇక ఎన్టీఆర్ కొత్త సినిమా వచ్చి రెండేళ్ళు అవుతున్నా అప్ కమింగ్ మూవీస్ లో మోహన్ లాల్ ఉన్నాడన్న వార్తలు కూడా వచ్చాయి.

రీసెంట్ గా ఆర్ ఆర్ ఆర్ సినిమా నే తీసుకుంటే సినిమా లో ఎన్టీఆర్ గురువు రోల్ ఒకటి ఉందని, ఆ రోల్ కోసం మోహన్ లాల్ ని అప్రోచ్ అయ్యారని మోహన్ లాల్ ఒప్పుకున్నారని వార్తలు చక్కర్లు కొట్టగా ఇప్పుడు ఎన్టీఆర్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అప్ కమింగ్ మూవీ లో…

మోహన్ లాల్ కీలక పాత్ర చేయబోతున్నారు అన్న వార్తలు చక్కర్లు కొట్టగా ఏవి నిజం అని కొందరు కన్ఫ్యూజ్ అవుతున్న విషయం తెలిసిందే, కానీ ఇవన్నీ అబద్దమే అని యూనిట్ కన్ఫాం చేసింది. ఇద్దరి కాంబినేషన్ పై క్రేజ్ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఏ రోల్ కోసం కూడా మోహన్ లాల్ ని అప్రోచ్ అవ్వలేదని…

కన్ఫాం చేసేశారు… దాంతో ఇవన్నీ రూమర్స్ అని తేలిపోయింది. ప్రస్తుతం మోహన్ లాల్ కూడా పెద్దగా తెలుగు సినిమా లు ఏవి కమిట్ కాలేదు, మలయాళంలోనే వరుస సినిమా లు చేస్తుండగా మరో పక్క ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ తర్వాత త్రివిక్రమ్ సినిమాతో బిజీ గా ఉండబోతున్నాడని సమాచారం…

Leave a Comment