న్యూస్ స్పెషల్

ఎన్టీఆర్-విజయ్ ఫ్యాన్స్ గొడవ…టాలీవుడ్ మొత్తం ఏకం అయ్యింది!!

సోషల్ మీడియా లో ఫ్యాన్స్ గొడవలు కామనే… కానీ ఇతర ఇండస్ట్రీ ల వారు టాలీవుడ్ పై ఏదైనా అటాక్ చేస్తే టాలీవుడ్ ఫ్యాన్స్ గొడవలు మర్చిపోయి యునైటెడ్ టాలీవుడ్ అంటే ఏంటో చూపిస్తూ దూసుకు పోతుంటారు. రీసెంట్ గా ఇలాంటిదే మళ్ళీ రిపీట్ అయింది. వివరాల్లోకి వెళితే…యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఒక యూనిక్ మూవీ గా నిలిచిపోయిన సినిమా యమదొంగ రిలీజ్ అయిన 12 ఏళ్ళకి ఇప్పుడు తమిళ్ లో విజయన్ గా రిలీజ్ అవుతుంది.

దాంతో సోషల్ మీడియా లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సినిమా కి ప్రమోషన్ చేస్తుండగా కోలివుడ్ నుండి హీరోల ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేశారు. కానీ ఒక అభిమాని అత్యుత్సాహంతో ఎన్టీఆర్ యమదొంగలో చేసిన డాన్స్ చూసి మీరు షాక్ అవ్వడం ఖాయం అంటూ కామెంట్స్ చేయగా కోలివుడ్ నుండి విజయ్ ఫ్యాన్స్ ఒక్కసారిగా రెచ్చిపోయారు.

మా హీరో డాన్స్ ముందు మీ హీరో ఎందుకు పనిరాడు అన్న రేంజ్ లో వరుస ట్వీట్స్ తో రేచ్చిపోగా కౌంటర్ గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్ డాన్స్ వీడియో లను ట్విట్టర్ లో పెడుతూ ఇదీ డాన్స్ అంటే అంటూ నువ్వా నేనా అంటూ రెచ్చిపోయారు. ఇక సడెన్ గా టాలీవుడ్ హీరోని అనడంతో ఇతర హీరోల ఫ్యాన్స్ సీన్ లోకి ఎంటర్ అయ్యారు.

దాదాపు టాప్ స్టార్ హీరోల ఫ్యాన్స్ అందరు అసలు ఎన్టీఆర్ డాన్స్ ముందు విజయ్ ఏమాత్రం సరిపోడు అంటూ గట్టి కౌంటర్స్ వేశారు. రియాలిటీ లో కూడా కోలివుడ్ లో పెద్దగా డాన్స్ విరగదీసే హీరోలు లేరు. ఉన్నంతలో విజయ్ బెస్ట్ డాన్సర్… ఇటు టాలీవుడ్ లో మనకు చాలా మంది బెస్ట్ డాన్సర్స్ ఉన్నారు.

అందులో సింగిల్ టేక్ డాన్సర్ అంటూ ఎన్టీఆర్ కి స్పెషల్ నేమ్ ఉంది. ఎన్టీఆర్ డాన్స్ తో విజయ్ డాన్స్ అసలు పోల్చడానికి కూడా సరిపోదు అన్నది ఎవ్వరూ కాదనలేని నిజం… అలాంటిది మా హీరో డాన్స్ ముందు ఎవ్వరూ సరిపోరు అంటూ విజయ్ ఫ్యాన్స్ రెచ్చిపోవడం తో టాలీవుడ్ హీరోల ఫ్యాన్స్ మరింత రెచ్చిపోయి కౌంటర్స్ వేశారు.

విజయ్ లేటెస్ట్ మూవీ విజిల్ ఇక్కడ హీరో కూడా రాకుండా ఎలాంటి ప్రమోషన్స్ లేకున్నా టాలీవుడ్ ఆడియన్స్ ఆదరించి ఏకంగా 20 కోట్లకు పైగా గ్రాస్ ని కట్టబెట్టారు. వాళ్ళు మాత్రం చిన్న విషయానికి మన హీరోని అంటారా అంటూ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు.

ఇక్కడ విశేషం ఏంటి అంటే కొంతమంది విజయ్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ డాన్స్ వీడియో లు చూసి ఇవి ఫాస్ట్ ఫార్వార్డ్ చేసి ఎడిట్ చేశారు అంటూ కామెంట్స్ చేయడం అవి చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ డాన్స్ ఆ రేంజ్ స్పీడ్ ఉంటుంది అది ఎన్టీఆర్ రేంజ్ అంటూ కామెంట్స్ చేయడం హైలెట్…

Leave a Comment