న్యూస్ స్పెషల్

ఎన్టీఆర్ 6 నెలలు, అల్లుఅర్జున్ 20 రోజులు…బాలయ్య 16 రోజులు…అరాచాకం ఇదీ!

టాలీవుడ్ లో రీసెంట్ టైం లో వరుస పెట్టి కొన్ని సినిమాల టీసర్ లు ఊహకందని సంచలనాలను నమోదు చేస్తూ దూసుకు పోతున్నాయి. ఇది వరకు మన టీసర్ లు 20-30 మిలియన్ రేంజ్ లోనే వ్యూస్ ని లైఫ్ టైం లో సొంతం చేసుకుంటూ ఉండగా ఇప్పుడు అది మారిపోయి మన టీసర్ లు మరింత జోరుగా కొత్త రికార్డులను నమోదు చేస్తూ ఉండటం విశేషం అనే చెప్పాలి, టాలీవుడ్ లో ఇప్పటి వరకు రిలీజ్ అయిన…

టీసర్ లలో కొన్ని టీసర్ లు ఏకంగా 50 మిలియన్ వ్యూస్ మార్క్ ని కూడా అందుకుని సంచలన రికార్డులను నమోదు చేశాయి. వాటిలో ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇంట్రో టీసర్ పరంగా ఈ మార్క్ ని అందుకుని రికార్డ్ సృష్టించాడు.

టాలీవుడ్ తరుపున మొట్ట మొదటి 50 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకున్న టీసర్ గా నిలవగా తర్వాత అల్లు అర్జున్ పుష్ప సినిమా ఇంట్రో టీసర్ ఫాస్టెస్ట్ 50 మిలియన్  వ్యూస్ మార్క్ ని అందుకున్న టీసర్ గా సంచలనం సృష్టించాడు. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా బాలయ్య నటించిన అఖండ సినిమా టీసర్…

ఏకంగా ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకుని సీనియర్ హీరోల్లో కొత్త రికార్డ్ ను నమోదు చేయగా దాంతో పాటు ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్ ని అతి తక్కువ టైం లో సొంతం చేసుకుంది, ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ 50 మిలియన్ వ్యూస్ ని అందుకోవడానికి 6 నెలలకు పైగా టైం పట్టగా తర్వాత అల్లు అర్జున్ పుష్ప ఇంట్రో టీసర్ కి…

ఈ మార్క్ ని అందుకోవడానికి 20 రోజుల టైం పట్టింది, ఇక ఇప్పుడు బాలయ్య అఖండ టీసర్ 50 మిలియన్ వ్యూస్ ని కేవలం 16 రోజుల టైం మాత్రమే తీసుకుని టాలీవుడ్ లో ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్ ని అందుకున్న టీసర్ గా సంచలన రికార్డ్ ను నమోదు చేసింది, సీనియర్ హీరో సినిమా ఈ రేంజ్ లో ఫాస్టెస్ట్ రికార్డ్ ను అందుకోవడం విశేషం అనే చెప్పాలి.

Leave a Comment