న్యూస్ బాక్స్ ఆఫీస్

ఎవరు కలెక్షన్స్: అమ్మింది 10 కోట్లకు…5 రోజుల్లో వచ్చింది ఇది!!

థ్రిల్లర్ మూవీస్ జానర్ ని చాలా మంది హీరోలు ఎప్పుడో కానీ టచ్ చేయరు, కానీ ఆ కాన్సెప్ట్ లను ఎంచుకుంటూ వరుసగా హిట్లు కొడుతున్న యంగ్ హీరో అడవి శేష్ నటించిన లేటెస్ట్ మూవీ ఎవరు బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి అల్టిమేట్ రివ్యూ లను సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు నుండే కలెక్షన్స్ పరంగా కుమ్మేస్తూ దూసుకు పోతున్న ఈ సినిమా…

మొదటి వీకెండ్ లోనే 7 కోట్లకు పైగా షేర్ ని అందుకుని దుమ్ము లేపగా ఇప్పుడు వర్కింగ్ డే అయిన 5 వ రోజు కూడా సాలిడ్ గా హోల్డ్ చేసి సత్తా చాటుకున్న ఈ సినిమా 5 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో 70 లక్షలకు పైగా షేర్ ని సాధించి భారీగా హోల్డ్ చేసింది.

ఇక వరల్డ్ వైడ్ గా 5 వ రోజున 90 లక్షలకు పైగా షేర్ ని అందుకుని దుమ్ము లేపిన ఈ సినిమా మొత్తం మీద 5 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాలలో 6.48 కోట్ల షేర్ ని అందుకుంది, వరల్డ్ వైడ్ గా 8.22 కోట్ల షేర్ ని అందుకున్న ఈ సినిమా 14 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకుంది.

కాగా సినిమా ను బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 10 కోట్లకు అన్ని ఏరియాల్లో అమ్మగా 11 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన షేర్ ని పక్కకు పెడితే ఇక మీదట మొత్తం మీద 2.78 కోట్ల షేర్ ని వసూల్ చేస్తే బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకుంటుంది.

సినిమా సోమవారం హోల్డ్ చేసిన తీరు చూసిన ట్రేడ్ కచ్చితంగా సెకెండ్ వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకోవడం ఖాయమని అంటున్నారు. ఈ కలెక్షన్స్ అడవి శేష్ కెరీర్ బెస్ట్ కాగా సినిమా కూడా లాంగ్ రన్ లో కెరీర్ లో నంబర్ 1 మూవీ గా నిలుస్తుందని అంటున్నారు.

Leave a Comment