న్యూస్ బాక్స్ ఆఫీస్

ఎవరెస్ట్ నుండి పాతాళానికి….రజినీ లాస్ట్ 5 మూవీస్ AP-TG 1st డే కలెక్షన్స్!!

కోలివుడ్ తో పాటు టాలివుడ్ లో కూడా తిరుగు లేని క్రేజ్ ను సొంతం చేసుకున్న హీరోల్లో సూపర్ స్టార్ రజినీ అందరి కన్నా ముందు నిలిచే హీరో అని చెప్పాలి. రజినీ సినిమా వస్తుంది అంటే చాలు ఆడియన్స్ లో అంచనాలు ఓ రేంజ్ లో ఉండేవి, బిజినెస్ లు రికార్డ్ లెవల్ లో జరిగేవి. థియేటర్స్ దగ్గర తెలుగు టాప్ స్టార్స్ కి జరిగే హంగామా ఉండేది… కానీ ఇదంతా…

కబాలి టైం వరకే, తర్వాత రజినీ మూవీస్ కి తెలుగు లో ఒకటి తర్వాత ఒకటి ఎదురు దెబ్బలు సాలిడ్ గా తగులుతూ ఇప్పుడు మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రావడం లేదు, రీసెంట్ టైం లో రజినీ నటించిన సినిమాల ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని గమనిస్తే…

లింగా సినిమా తెలుగు లో 2.55 కోట్ల షేర్ తో ఓపెన్ అవ్వగా తర్వాత కబాలి ఆల్ టైం రికార్డ్ లెవల్ లో 9.3 కోట్ల షేర్ తో ఊచకోత కోసింది, తర్వాత వచ్చిన కాలా భారీ దెబ్బ కొడుతూ 3.35 కోట్ల షేర్ ని అందుకోగా రజినీ శంకర్ ల కాంబోలో వచ్చిన…

రోబో 2.0 సినిమా 12.5 కోట్ల షేర్ ని అందుకుంది, ఇక తర్వాత వచ్చిన పేట అప్పట్లో ఆల్ టైం డిసాస్టర్ ఓపెనింగ్స్ ని 1.65 కోట్లతో ఓపెన్ అవ్వగా తర్వాత మురగదాస్ డైరెక్షన్ లో చేసిన దర్బార్ సినిమా 4.52 కోట్ల షేర్ ని అందుకుని తిరిగి ఊపు చూపెట్టే ప్రయత్నం చేసినా ఇప్పుడు వచ్చిన పెద్దన్న సినిమా రీసెంట్ టైం లోనే ఆల్ టైం లోవేస్ట్ అనిపించేలా…

1.6 కోట్ల షేర్ ని మాత్ర్రమే అందుకుని భారీ దెబ్బ కొట్టింది, శిఖరం అంత ఎత్తు నుండి ఇప్పుడు పాతాళానికి పడిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. ఫ్యూచర్ లో రజినీ నుండి ఓ బిగ్గెస్ట్ కంబ్యాక్ వస్తే మళ్ళీ వింటేజ్ రజినీ రాంపేజ్ చూడాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటున్నారు. మరి అది నిజం అవుతుందో లేదో చూడాలి ఇక..

Leave a Comment