గాసిప్స్ న్యూస్

ఏంటి…గోపీచంద్ సీటిమార్ కి ఇన్ని కోట్ల బడ్జెటా…షాకింగ్ అసలు!!

మాస్ హీరోగా ఒకప్పుడు మంచి మార్కెట్ ని సొంతం చేసుకున్న యాక్షన్ హీరో గోపీచంద్, రీసెంట్ టైం లో హిట్ కొట్టి చాలా కాలమే అవుతుంది… ఆల్ మోస్ట్ 7 ఏళ్ల క్రితం లౌక్యం సినిమా తో బ్లాక్ బస్టర్ కొట్టిన గోపీచంద్ తర్వాత చేసిన సినిమాల్లో కొన్ని అలరించినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ ను అయితే సొంతం చేసుకోలేదు… ఇలాంటి టైం లో కూడా గోపీచంద్ తో సినిమాలకు…

బడ్జెట్ 20 కోట్ల రేంజ్ లో పెట్టడం జరిగింది.. దానికి కారణం బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఇప్పటికీ గోపీచంద్ సినిమాలకు మంచి బిజినెస్ జరుగుతూ ఉండటం తో ఆ రేంజ్ బడ్జెట్ కూడా వర్కౌట్ అవుతూ వచ్చింది నిర్మాతలకు…

కానీ లాస్ట్ టైం గోపీచంద్ చేసిన చాణక్య సినిమా బడ్జెట్ ఓవర్ అవ్వడం తో నష్టాలు వచ్చాయి, కానీ ఇప్పుడు గోపీచంద్ ఒప్పుకున్న లేటెస్ట్ మూవీ సీటిమార్ సినిమా ను ముందు 20 నుండి 23 కోట్ల రేంజ్ బడ్జెట్ లో కంప్లీట్ చేయాలి అనుకున్నా ఇప్పుడు సినిమా మొత్తం పూర్తీ అయ్యే టైం కి…

బడ్జెట్ మొత్తం హద్దులు దాటింది అని సమాచారం, లాస్ట్ ఇయర్ ఫస్ట్ వేవ్ ఎఫెక్ట్ వలన ఈ ఇయర్ సెకెండ్ వలన సినిమా షూటింగ్ భారీగా డిలే అవుతూ రావడం బడ్జెట్ పెరిగిపోతూ రావడం వలన ఇప్పుడు సినిమా మొత్తం మీద బడ్జెట్ ముందు అనుకున్న రేటు కన్నా కూడా ఆల్ మోస్ట్ డబుల్ రేంజ్ కి వచ్చిందని అంటున్నారు ఇప్పుడు…

సినిమా కి ఇప్పుడు ఓవరాల్ గా పూర్తీ అయ్యే టైం కి 38 కోట్ల రేంజ్ బడ్జెట్ అయిందని అంటున్నారు. ప్రజెంట్ గోపీచంద్ మార్కెట్ కి ఇది భారీ రిస్క్ అనే చెప్పాలి. కానీ ట్రైలర్ కి డీసెంట్ అప్లాజ్ వస్తూ ఉండటం తో థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ బిజినెస్ తో చాలా వరకు రికవరీ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు. సినిమా కంప్లీట్ బిజినెస్ డీటైల్స్ త్వరలోనే రివీల్ అవుతాయి… మరి ఈ బడ్జెట్ లెక్కల్లో ఎంతవరకు రికవరీ చేస్తుందో చూడాలి..

Leave a Comment