న్యూస్ బాక్స్ ఆఫీస్

ఏం రికార్డులు సామి…ఇటు 30 అటు 50, నైజాం లో 10…పోతరాజు వీరంగం ఇది!!

మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ క్రాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాలను పూర్తీ చేసుకుని సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊచకోత కోసిన విషయం తెలిసిందే. రవితేజ కెరీర్ లో నంబర్ 1 మూవీ గా నిలిచిన ఈ సినిమా రెండో వారం వర్కింగ్ డేస్ లో మిగిలిన సినిమాల కన్నా కూడా సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది, ఈ క్రమం లో… కెరీర్ బెస్ట్…

రికార్డులను కూడా నమోదు చేస్తున్న సినిమా ఇప్పటికే రవితేజ కెరీర్ లో నంబర్ 1 రికార్డులను నమోదు చేయగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నైజాం ఏరియా లో 10 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది… ఇది రవితేజ కెరీర్ లో రెండవ 10 కోట్ల మార్క్…

అందుకున్న సినిమాగా కాగా మొదటి ప్లేస్ లో రాజా ది గ్రేట్ 11 కోట్లకు పైగా షేర్ తో ఉంది, ఇక క్రాక్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో 30 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది, ఇది కూడా రవితేజ కెరీర్ లో మొట్టమొదటి 30 కోట్ల మూవీ…

ఇక సినిమా మరో మైలురాయిని కూడా అందుకుంది. సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 50 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని మరో సంచలనం సృష్టించింది. ఇలా అనేక రికార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమా పాండమిక్ తర్వాత ఈ మార్కులను అందుకున్న మొట్ట మొదటి సినిమాగా కూడా నిలిచి మరో సంచలనం కూడా సృష్టించింది… బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగు బాక్ టు బాక్…

డిసాస్టర్ మూవీస్ తర్వాత రవితేజ ఇలాంటి కంబ్యాక్ ఇవ్వడం అంటే మామూలు మాస్ కాదు, మొదటి రోజు రిలీజ్ ఇబ్బందులు థియేటర్స్ సమస్యలు 50% లిమిటేషన్లు ఇలా అనేక అవరోధాలు ఉన్నా ఊరమాస్ కంబ్యాక్ ని మాస్ మహారాజ్ రవితేజ ఈ సినిమా తో సొంతం చేసుకున్నాడు.

Leave a Comment