న్యూస్ రివ్యూ

ఏక్ మినీ కథ రివ్యూ….బాగుంది కానీ!!

తను నేను, పేపర్ బాయ్ లాంటి సినిమాల తర్వాత సంతోష్ శోభన్ నటించిన లేటెస్ట్ మూవీ ఏక్ మినీ కథ… యువి క్రియేషన్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకోగా రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ కి తగ్గట్లే బోల్డ్ కంటెంట్ తో వచ్చినప్పటికీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అన్నట్లు అనిపించిందా లేదో తెలుసుకుందాం పదండీ…

కథ పాయింట్ కి వస్తే…చిన్నప్పుడే తన మెయిన్ పార్ట్ చిన్నదని ఫీల్ అవుతూ ఉంటాడు, ఆ ఫీల్ తోనే చదువు కూడా సరిగ్గా చదవకుండా ఓ చిన్న జాబ్ చేసుకుంటున్న టైం లో పెళ్లి సంభందాలు వస్తూ ఉంటే వాటిని ఎలాగోలా చెడగొడుతూ ఉంటాడు… అనుకోకుండా హీరోయిన్ ని చూసి…

ఇష్టపడ్డా తనతో కూడా పెళ్లిని ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ చేస్తాడు, కానీ పెళ్లి జరుగుతుంది, తర్వాత ఏమైంది, అసలు హీరో ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటి లాంటి విశేషాలు అన్నీ కూడా సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. పెర్ఫార్మెన్స్ పరంగా సంతోష్ శోభన్ తొలి 2 సినిమాల కన్నా కూడా బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు.

చాలా సీన్స్ లో బాగా నటించి నటుడిగా మరో స్టెప్ ఎక్కాడు, ఇక హీరోయిన్ రోల్ కి పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు కానీ ఉన్నంతలో పర్వాలేదు… చివర్లో గ్లామర్ డోస్ తో మెప్పించింది కూడా… ఇక శ్రద్ధా దాస్ చిన్న రోల్ లో పర్వాలేదు అనిపించగా… కామెడీ గ్యాంగ్ సప్తగిరి, సుదర్శన్ మరియు పోసాని ఉన్న రోల్స్ లో అదరగొట్టారు.

సంగీతం పర్వాలేదు అనిపించే విధంగా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది, ఎడిటింగ్ కొంచం ఫాస్ట్ గా ఉండాల్సింది, స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉన్నా అక్కడక్కడా రిపీటివ్ గా అనిపిస్తుంది. ఇక సినిమాటోగ్రఫీ అదిరిపోయే విధంగా ఉండగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అదిరిపోయాయి. ఇక డైలాగ్స్ కూడా బాగుండగా…

అక్కడక్కడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నప్పటికీ చాలా వరకు క్లాస్ గానే చెప్పే ప్రయత్నం చేశారు. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే కార్తిక్ రాపోలు ఎంచుకున్న పాయింట్ డిఫెరెంట్ గా ఉండగా ఆ ప్రయత్నాన్ని కంప్లీట్ గా అడల్ట్ గా కాకుండా కంప్లీట్ గా ఫ్యామిలీ సబ్జక్ట్ గా తీయలేని కథ అయినా తీసే ప్రయత్నం చేశారు…

కానీ ఫ్యామిలీ తో కూర్చుని సినిమా చూడటం చాలా కష్టం అనే చెప్పాలి, కుదిరితే ఫ్యామిలీ తో కాకుండా సింగిల్ గానే చూడటం బెటర్… థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఉంటే ఫ్యామిలీ ఆడియన్స్ తో చూస్తే చాలా కష్టంగానే ఉండేది, OTT లో రిలీజ్ చేసి మంచి పనే చేశారు. మొత్తం మీద సినిమాలో చెప్పాలి అనుకున్న పాయింట్ చాలా సింపుల్ గా అక్కడక్కడా బోర్ కొట్టినా…

ఓవరాల్ గా ఆడియన్స్ ని చాలా వరకు మెప్పించే ప్రయత్నంలో టీం సఫలం అయింది. కానీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అంటూ టీం చెప్పినట్లు ఫ్యామిలీతో చూసే సినిమా అయితే కాదు, బయట వేరొకరితో డిస్కస్ చేయడానికి ఇబ్బంది పడే సబ్జెక్ట్ ని సినిమా గా ఉన్నంతలో బాగానే ప్రజెంట్ చేశారు…కానీ…

మొత్తం మీద కంప్లీట్ గా అడల్ట్ మూవీ కాకుండా ఇటు ఫ్యామిలీ సబ్జెక్ట్ కాకుండా మిడిల్ లో ఆగిపోయింది సినిమా… అయినా కానీ చాలా వరకు మెప్పించే విధంగా ఉండటం తో సినిమా కి ఫైనల్ గా మేం ఇస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్. ఇక OTT లో సినిమా కి ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Leave a Comment