గాసిప్స్ న్యూస్

ఏడాది నుండి ఆగిన రిలీజ్..అప్పుల ఖర్చులు 10 కోట్లు….మళ్ళీ రిలీజ్ ఆగింది…తలపట్టుకున్న నిర్మాత!

పరిస్థితులు మళ్ళీ తిరగబడుతున్నాయి…ఏడాది నుండి వెయిటింగ్ లో ఉన్న మూవీస్ మళ్ళీ ఆడియన్స్ ముందుకు రావడానికి ప్రయత్నాలు మొదలు పెట్టగా ఇంతలో మళ్ళీ కేసుల సంఖ్య పెరగడం తో ఇప్పుడు తిరిగి సినిమాల రిలీజ్ లు ఆగిపోయాయి. అక్కడ థియేటర్స్ మొత్తం బంద్ చేశారు. బాలీవుడ్ మొత్తం ఇప్పుడు మరింత షాకవుతున్నారు అని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ మార్చ్ నుండి థియేటర్స్ అన్నీ బంద్ అవ్వగా మిగిలిన ఇండస్ట్రీలు ఇయర్ ఎండ్ నుండి తిరిగి…

తేరుకుంటూ ఉన్నా కానీ బాలీవుడ్ వాళ్ళు మాత్రం ఇంకా ఒక్కంటంటే ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేక పోయారు. ఇక రీసెంట్ గా మహారాష్ట్రలో కేసులు విపరీతంగా పెరిగి పోవడంతో ఇప్పుడు అక్కడ థియేటర్స్ అన్నీ కూడా ఈ నెల చివరి వరకు బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇలాంటి టైం లో బాలీవుడ్ లో బిగ్ రిలీజ్ లు అన్నీ కూడా ఇప్పుడు రిలీజ్ డేట్ లను మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకునే పనిలో పడగా లాస్ట్ ఇయర్ సమ్మర్ కానుకగా రావాల్సిన అక్షయ్ కుమార్ నటించిన సూర్యవంశీ సినిమా ఈ నెల ఎండ్ లో రిలీజ్ కానుండగా….

ఇప్పుడు థియేటర్స్ బంద్ అవ్వడం తో రిలీజ్ ను మళ్ళీ ఆపేయక తప్పని పరిస్థితి నెలకొంది. దాంతో ఏడాది నుండి రిలీజ్ ఆగిన ఈ సినిమా అప్పుల భాద కూడా పెరిగి పోయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఎంత పెద్ద నిర్మాత అయినా ఫైనాన్స్ డబ్బులతోనే ఎక్కువగా సినిమాలను నిర్మిస్తారు.. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో రూపొందగా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యి ఉంటే….

నిర్మాతకి మంచి లాభాలు తెచ్చి పెట్టేది. కానీ రిలీజ్ ఆగడం తో ఇప్పటి వరకు 10 కోట్ల వడ్డీ కట్టారట నిర్మాతలు, ఇప్పుడు రిలీజ్ ను అనౌన్స్ చేసి బిజినెస్ చేయగా మళ్ళీ ఆగిపోవడం తో ఇప్పుడు డైరెక్ట్ OTT రిలీజ్ కి ట్రై చేస్తున్నారట. అలాగైనా అప్పుల భాద తగ్గుతుందని భావిస్తున్నారని తెలుస్తుంది. మరి ఆ విధంగా అయినా ఏమైనా బెటర్ ఆఫర్స్ వస్తాయో చూడాలి.

Leave a Comment