గాసిప్స్ న్యూస్

ఏడాది నుండి కష్టపడితే ఇప్పుడు ఫినిష్….మెగాస్టార్ రాజముద్ర పడినట్లే!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అప్ కమింగ్ మూవీస్ లైనప్ ఏంటి అనేది ఆల్ రెడీ మెగాస్టార్ చిరంజీవి చెప్పేశారు, ఆచార్య తర్వాత చేయబోతున్న సినిమాలు లూసిఫర్ రీమేక్, వేదాలం రీమేక్ తర్వాత బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా ను కన్ఫాం చేసిన మెగాస్టార్ వన్ బై వన్ సినిమాలను పూర్తీ చేసి ఆడియన్స్ ముందుకు తీసుకు రావాలని చూస్తూ ఉండగా ముందుగా ఆచార్య సినిమా సమ్మర్ కానుకగా ఆడియన్స్ ముందు రానుంది.

ఇక ఆ సినిమా తర్వాత ముందు వేదాలం రీమేక్ ని మొదలు పెట్టాలి అనుకున్నా ఆ ప్లేస్ లో లూసిఫర్ రీమేక్ ని ఓకే చేయలాని డిసైడ్ అయ్యారట మెగాస్టార్. లూసిఫర్ రీమేక్ ని తెలుగు లో కొన్ని మార్పులు చేర్పులతో చేయాలి అనుకున్న చిరు కి…అనుకూలంగా ఆ మార్పులను…

ముందు అనుకున్న సుజిత్ కానీ, తర్వాత అనుకున్న వినాయక్ కానీ ఆశించిన మేర చేయలేక పోయారు. దాంతో ఆ ఆఫర్ అనుకోకుండా ధృవ ఒరిజినల్ వర్షన్ తీసిన డైరెక్టర్ మోహన్ రాజా దగ్గరకు వచ్చింది. అఫీషియల్ ఈ ప్రాజెక్ట్ ను కన్ఫాం కూడా చేశారు…

ఇక తెలుగు మార్పులు చేర్పులు ఎట్టకేలకు కంప్లీట్ అవ్వగా అన్ని మార్పులను చిరు విని అద్బుతంగా తీర్చి దిద్దారని డైరెక్టర్ ను పొగిడినట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ఆల్ మోస్ట్ ఏడాది నుండి ఈ కథ తెలుగు మార్పుల కోసం కష్ట పడుతూనే ఉండగా ఎట్టకేలకు ఇప్పుడు మార్పులు చేర్పులు అన్నీ కంప్లీట్ అయ్యి దానికి మెగాస్టార్ రాజముద్ర కూడా పడినట్లు అయింది.

దాంతో ఇప్పుడు ఆచార్య కంప్లీట్ అయిన వెంటనే ఈ సినిమా ను మొదలు పెట్టాలని మెగాస్టార్ చూస్తున్నట్లు సమాచారం. కాస్ట్ అండ్ క్రూ వివరాలు ఇంకా అఫీషియల్ గా కన్ఫాం చేయాల్సి ఉండగా ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుందని సమాచారం. మరి ఒరిజినల్ ని మరిపించి ఈ సినిమా తెలుగు లో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

Leave a Comment