న్యూస్

ఏ బ్యాగ్రౌండ్ లేని హీరో…4 కొత్త సినిమాలు…ఒక్కో సినిమాకి రెమ్యునరేషన్ ఎంతంటే?

ఇండస్ట్రీ లో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగిన వాళ్ళు చాలా తక్కువ అనే చెప్పాలి. ఒకప్పుడు పెద్దగా కాంపిటీషన్ అనేది లేదు అయినా కానీ కొత్త వాళ్ళు ఎదిగింది చాలా తక్కువ. ఇక ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో పోటి ఇంకా ఎన్నో రెట్లు పెరిగిన టైం లో స్టార్ కిడ్స్ కే ఛాన్స్ దొరకడం తక్కువ అవుతున్న టైం లో కొత్త హీరోలకి అవకాశాలు ఛాన్సులు చాలా తక్కువగానే దొరుకు తున్నాయి అని చెప్పాలి.

అయినా కానీ కొందరు స్టార్ బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగిన వాళ్ళు ఉండగా ఇప్పుడు మరో కొత్త హీరో కూడా ఎలాంటి స్టార్ బ్యాగ్రౌండ్ లేకుండా మెల్లి మెల్లిగా తన మార్క్ ని చూపెడుతూ అవకాశాలను ఒకటి తర్వాత ఒకటి సొంతం చేసుకుంటున్నాడు… ఆ హీరోనే కిరణ్ అబ్బవరం….

టాలీవుడ్ కి ‘రాజా వారు రాణివారు’ సినిమాతో పరిచయం అయిన ఈ హీరో తొలి సినిమాతో మెప్పించగా ఇప్పుడు రెండో సినిమా SR కళ్యాణ మండపం తో మంచి బజ్ ని క్రియేట్ చేసుకుని ఆడియన్స్ ముందుకు సినిమాను త్వరలో తీసుకు రాబోతుండగా ఈ సినిమా కాకుండా ఇప్పుడు…

మరో 3 సినిమాలను రీసెంట్ గా తన పుట్టిన రోజు అనౌన్స్ చేశాడు. ‘సమ్మతమే’ ‘సెబాస్టియన్’ కోడి రామకృష్ణ తనయురాలు దివ్య దీప్తి నిర్మాణంలో కిరణ్ హీరోగా కార్తీక్ శంకర్ కొత్త దర్శకుడు రూపొందించనున్న సినిమాను కూడా అనౌన్స్ చేశారు. ఇలా వరుస పెట్టి 4 సినిమాలను ఒకటి తర్వాత ఒకటి ఆడియన్స్ ముందుకు తీసుకు రావడానికి సిద్ధం చేసుకున్న కిరణ్ ఒక్కో సినిమా కి ఇప్పుడు…

40-50 లక్షల వరకు రెమ్యునరేషన్ ని కూడా తీసుకుంటున్నాడని సమాచారం. ఒక సినిమా చేసిన ఒక అప్ కమింగ్ యాక్టర్ కి ఇంత రెమ్యునరేషన్ అంటే గొప్పే అని చెప్పాలి. అప్ కమింగ్ సినిమాల్లో రెండు మంచి విజయాలుగా నిలిచినా మరింత మార్కెట్ ని ఈ హీరో సొంతం చేసుకునే అవకాశం బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతైనా ఉందని చెప్పాలి.

Leave a Comment