న్యూస్ స్పెషల్

ఏ హీరో కి లేని రికార్డ్ కొట్టిన అడవి శేష్!

టాలీవుడ్ లో చిన్న హీరోలకు పెద్దగా హిట్లు పడటం అరుదు, అది కూడా ఒకటి తర్వాత ఒకటి పడటం మరింత అరుదు, ఇవన్నీ ఒకెత్తు అయితే యంగ్ హీరో అడవి శేష్ మరో విచిత్రమైన రికార్డ్ ను నమోదు చేశాడు, బహుశా టాలీవుడ్ లో ఉన్న ప్రస్తుత హీరోలలో ఇలాంటి రేర్ రికార్డ్ ను ఎవ్వరూ అందుకుని ఉండరు. అసలు మ్యాటర్ లోకి వస్తే… హీరోలు ఎవరైనా తమకి స్టార్ డం వచ్చాకా…

పెద్దగా ప్రయోగాలు చేయడానికి ఇష్టపడరు, చేసినా రిజల్ట్ ఎలా ఉంటుందని టెన్షన్, ఇక అప్ కమింగ్ హీరోలు తమ ప్రత్యేకతని చాటుకోవడానికి మొదటి ఒకటి 2 సినిమాలు చేస్తే చేసి ఉండొచ్చు, అవి సక్సెస్ అవుతాయో లేదో అన్నది డౌట్, కానీ అడవి శేష్ కెరీర్ లో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ నడుస్తుంది.

అడవి శేష్ నటించిన చివరి 4 సినిమాల్లో మూడో ఎక్స్ పెరి మెంటల్ మూవీస్, ఆ మూడు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అయినవే. క్షణం, గూడచారి ఇప్పుడు ఎవరు సినిమాలు అన్ని ఎక్స్ పెరి మెంటల్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ కథలు. మూడుకి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్స్ గా నిలిచినవే…

ఇలా సస్పెన్స్ థ్రిల్లర్ కథ లతో బాక్స్ ఆఫీస్ హాట్రిక్ కొట్టిన ఒకే ఒక్క టాలీవుడ్ హీరోగా అడవి శేష్ నిలుస్తాడు అని చెప్పాలి. వేరే వాళ్ళని తక్కువ చేయాలి అని కాదు ఇలాంటి కాన్సెప్ట్ లను ప్రేక్షకులను అలరించే విధంగా తీస్తూ హిట్లు కొట్టడం అంటే గొప్పే అని చెప్పాలి.

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవరు తో బాక్ టు బాక్ 4 హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు అడవి శేష్, పైన చెప్పిన మూడు సినిమాలతో పాటు మధ్యలో అమీ తుమీ అంటూ కామెడీ హిట్ కొట్టాడు. ఓవరాల్ గా యంగ్ హీరోల్లో తన కంటూ స్పెషల్ గుర్తింపు తో దూసుకు పోతున్నాడు అడవిశేష్,

Leave a Comment