గాసిప్స్ న్యూస్

ఒకప్పుడు 6 కోట్లు…ఇప్పుడు 8 ఏళ్లకి రీ ఎంట్రీ…ఇప్పుడు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

ఒకప్పుడు టాలీవుడ్ లో కెరీర్ పీక్ స్టేజ్ క్రేజ్ ని ఎంజాయ్ చేసిన హీరోలలో హీరో సిద్దార్థ్ కూడా ఒకరు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో తెలుగు లో ఫస్ట్ స్ట్రైట్ మూవీ చేసిన సిద్దార్థ్ తర్వాత బొమ్మరిల్లు అల్టిమేట్ హిట్ తో తిరుగు లేని లవర్ బాయ్ ఇమేజ్ ని సొంతం చేసుకుని వరుస పెట్టి సినిమాలతో జోరు చూపాడు. మాస్ ఇమేజ్ కోసం కొన్ని ప్రయత్నాలు చేసి బెడసి కొట్టడం తో…

తెలుగు లో అవకాశాలు తగ్గాయి, కానీ కెరీర్ పీక్ టైం లో తెలుగు లో 6 కోట్లకు పైగా రెమ్యునరేషన్ ని ఆ టైం లోనే సొంతం చేసుకున్నాడు సిద్దార్థ్, చివరగా తెలుగు లో 2013 లో జబర్దస్త్ సినిమా చేసిన సిద్దార్థ్ ఆ సినిమా ఫ్లాఫ్ తర్వాత తెలుగు కి దూరం అయ్యాడు.

తర్వాత ఎక్కువగా తమిళ్ మూవీస్ నే చేస్తూ వస్తున్న సిద్దార్థ్ అడపాదడపా ఆ సినిమాలను తెలుగు లో డబ్ చేసినా ఫుల్ లెంత్ మూవీ మాత్రం ఆల్ మోస్ట్ 8 ఏళ్ల తర్వాత ఇప్పుడు శర్వానంద్ తో కలిసి RX100 సినిమా తీసిన అజయ్ భూపతి డైరెక్షన్ లో…

మహా సముద్రం అనే మల్టీ స్టారర్ సినిమాలో కనిపిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఇయర్ లోనే ఆడియన్స్ ముందుకు రాబోతుండగా ఈ సినిమా కి గాను సిద్ధార్థ్ రెమ్యునరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీ లో లీక్ అయింది. ఒకప్పుడు 6 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకున్న సిద్దార్థ్ ఈ సినిమా కోసం 3 కోట్ల మేర రెమ్యునరేషన్ ని తీసుకుంటున్నారని సమచారం…

ప్రస్తుతం సిద్ధార్థ్ కి తెలుగు లో ఎలాంటి మార్కెట్ లేదనే చెప్పాలి, అయినా కానీ ఇంత రెమ్యునరేషన్ దక్కడం విశేషం అనే చెప్పాలి. ఇక ఈ సినిమా తర్వాత తిరిగి తెలుగు లో వరుస పెట్టి సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. దిల్ రాజు బ్యానర్ లో తర్వాత సినిమా ఉండబోతుంది అంటూ వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి.

కెరీర్ లో ఫస్ట్ టైం అల్లు అర్జున్ రీమేక్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాక్స్ అఫీస్ దగ్గర ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ఒక్క సారి కూడా రీమేక్ చేయలేదు, హిట్స్ కి ఫ్లాఫ్స్ ఎన్ని వచ్చినా సేఫ్ సైడ్ కోసం రీమేక్ ల భాట పట్టలేదు. ప్రస్తుతం కెరీర్ బెస్ట్ ఫాం ను సొంతం చేసుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు వరుస పెట్టి సినిమాలతో జోరు చూపుతున్నాడు.

ఇలాంటి టైం లో గీతా ఆర్ట్స్ వాళ్ళు తమిళ్ లో రీసెంట్ టైం లో మంచి హిట్ గా నిలిచిన ఓ సినిమా రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకున్నారట. ఆ సినిమా పేరు ఏంటి అనేది రివీల్ చేయలేదు కానీ ఆ రీమేక్ ని ఓన్ బ్యానర్ లో అల్లు అర్జున్ కి సెట్ అయ్యేలా మార్పులు చేర్పులు చేసి… రూపొందించాలి అని భావిస్తున్నారట.

కానీ కెరీర్ లో ఇప్పటి వరకు రీమేక్ చేయని అల్లు అర్జున్ ఇప్పుడు ఫస్ట్ టైం రీమేక్ చేస్తాడా అన్నది అనుమానమే అని చెప్పాలి. కానీ ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఇది నిజం అవుతుంది అంటూ గట్టిగానే చెబుతున్నారు. కానీ ప్రస్తుతం అల్లు అర్జున్…

పుష్ప తర్వాత కూడా కమిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి, వాటి తర్వాత ఈ సినిమా ఉంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమా ఈ ఇయర్ లో రిలీజ్ కానుండగా తర్వాత ఐకాన్ సినిమా సెట్స్ పైకి వెళుతుందని రీసెంట్ గా కన్ఫాం అయిన విషయం తెలిసిందే.

Leave a Comment