గాసిప్స్ న్యూస్

ఒక్కోటి ఒకో రకం…నితిన్ కెరీర్ టర్నింగ్ పక్కా!!

కెరీర్ ని అద్బుతంగా మొదలు పెట్టి మధ్య లో హిట్స్ అండ్ ఫ్లాఫ్స్ ఎదురు అయినా కానీ ఇష్క్ తో సెకెండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టి మళ్ళీ జోరు పెంచిన నితిన్ అ.ఆ హిట్ తో పీక్స్ కి వెళ్ళాడు. కానీ తర్వాత చేసిన సినిమా లు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర షాక్ ఇచ్చాయి… ఇలాంటి టైం లో మళ్ళీ 4 ఏళ్ల తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర కంబ్యాక్ చేశాడు నితిన్…

ఫిబ్రవరిలో భీష్మ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి కంబ్యాక్ ని సొంతం చేసుకోగా ఫ్యూచర్ ప్రాజెక్టులు కూడా సాలిడ్ గా ప్లాన్ చేసుకుంటూ ఈ సారి కెరీర్ ని పక్కా గా మరో స్టెప్ ముందుకు వేయడానికి సిద్ధం అవుతున్నాడు నితిన్.

తన అప్ కమింగ్ మూవీస్ కూడా ఒక్కోటి ఒక్కో రకమైన జానర్ కి సంభందించిన సినిమాలు అవ్వడం మరింత విశేషం అనే చెప్పాలి. భీష్మ ఎంటర్ టైనర్ తర్వాత రంగ్ దే ప్యూర్ లవ్ స్టొరీ చేస్తున్న నితిన్ తర్వాత రా రస్టిక్ నేపధ్యంలో ఊరమాస్ పవర్ పేట సినిమా చేయబోతున్నాడు.. ఈ సినిమా 2 పార్టులుగా రాబోతుండగా…

ఈ సినిమా కన్నా ముందు బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన అందా ధూన్ రీమేక్ చేయబోతున్నాడు. ఇది మరో డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీ అవ్వగా తర్వాత చంద్రశేఖర్ ఏలేటి డైరెక్షన్ లో చెస్ నేపధ్యంలో తెరకేక్కే మరో డిఫెరెంట్ మూవీ ప్లానింగ్ లో ఉన్నాడు నితిన్… ఇలా తన అప్ కమింగ్ సినిమాలు అన్నీ కూడా…

ఒక్కోటి ఒకరమైన జానర్ మూవీ అవ్వగా ఇందులో అన్ని అనుకున్నట్లు సక్సెస్ అయితే మాత్రం నితిన్ రేంజ్ అమాంతం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అందా ధూన్ రీమేక్ అండ్ పవర్ పేట సిరిస్ చాలా ముఖ్యం అని చెప్పాలి. ఇవీ రెండూ అంచనాలు అందుకుంటే కచ్చితంగా నితిన్ రేంజ్ సాలిడ్ గ్రోత్ అందుకోవచ్చు…

Leave a Comment