న్యూస్ బాక్స్ ఆఫీస్

ఒక్క అడుగు….అందరూ ఎదురు చూస్తున్న తరుణం ఇది!!

బాక్స్ ఆఫీస్ దగ్గర అల్లరి హిట్ కొట్టి ఏళ్ళు అవుతుంది, కెరీర్ లో ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరోగా అనేక విజయాలను సొంతం చేసుకున్న అల్లర్ నరేష్ ఒక టైం కి వచ్చే సరికి బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ పీక్ టైం ని కూడా చూశాడు కానీ తర్వాత నుండే బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కి దూరం అయిపోయిన అల్లరోడు, నికార్సయిన హిట్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు కానీ ఆ విజయాలు దక్కలేదు…

ఇలా ఏళ్ళు గడుస్తూ పోయింది, హిట్ లేక అల్లరోడి మార్కెట్ కి దెబ్బ కూడా పడటం మొదలు అయింది, దాంతో రీసెంట్ మూవీస్ కనీస ఓపెనింగ్స్ కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి టైం లో రీసెంట్ గా బంగారు బుల్లోడు సినిమా తో వచ్చాడు అల్లరోడు…

ఆ సినిమా కూడా నిరాశ పరిచి బాక్స్ ఆఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాఫ్ అవ్వగా ఇప్పుడు రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు నాంది సినిమా తో వచ్చాడు అల్లరి నరేష్. బాక్స్ అఫీస్ దగ్గర ఇది అల్లరి నరేష్ కంబ్యాక్ మూవీ గా ప్రతీ ఒక్కరూ మెచ్చుకోగా సినిమా అనుకున్నట్లుగానే…

కలెక్షన్స్ పరంగా కూడా మొదటి రోజు తక్కువ తో మొదలు అయ్యి రోజు రోజుకి కలెక్షన్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ మొదటి వీకెండ్ కి బిజినెస్ లో 70% రికవరీ చేసి దుమ్ము లేపింది. ఇక సినిమా 4 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో ఆల్ మోస్ట్ బిజినెస్ ను దాటేసి బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా వెళ్ళగా… ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ కి…

ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు అల్లరి నరేష్, ఆ మార్క్ ని 5 వ రోజు సాధించే కలెక్షన్స్ తో సొంతం చేసుకుని క్లీన్ హిట్ కొట్టడం ఖాయమని చెప్పాలి. దాదాపుగా బాక్స్ ఆఫీస్ దగ్గర 9 ఏళ్ల తర్వాత ఇప్పుడు అల్లరి నరేష్ క్లీన్ హిట్ కొట్టడానికి సిద్ధం అయ్యాడు అని చెప్పాలి. ఆ తరుణం కోసం ఇప్పుడు అందరు హీరోల ఫ్యాన్స్ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు…

Leave a Comment