గాసిప్స్ న్యూస్

ఒక్క అనౌన్స్ మెంట్…ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది!

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోగా, ఆ సినిమా తో తన మార్కెట్ ని అల్టిమేట్ లెవల్ లో ఎక్స్ పాన్షన్ చేసుకున్న ప్రభాస్ అది ఒక్క సినిమాకే పరిమితం కాదని సాహో సినిమా తో నిరూపించుకున్నాడు కూడా… డిసాస్టర్ టాక్ తో అల్టిమేట్ కలెక్షన్స్ ని ఇండియా వైడ్ గా సొంతం చేసుకుని షాక్ ఇచ్చింది ఆ సినిమా.

అలాంటి సినిమా తర్వాత ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమాలు అన్నీ కూడా మరో లెవల్ లో ఉండగా ముందుగా రాధే శ్యామ్ తో వస్తున్న ప్రభాస్ తర్వాత ఆదిపురుష్ మరియు నాగ్ అశ్విన్ ల కాంబినేషన్ లో సెన్సేషనల్ మూవీస్ చేస్తున్న విషయం తెలిసిందే… వీటితో పాటు ప్రభాస్…

KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయబోతున్నాడు అన్న వార్తా చాలా కాలంగా వస్తూనే ఉండగా ప్రశాంత్ నీల్ KGF2 తర్వాత ఎన్టీఆర్ తో సినిమా కమిట్ అవ్వగా మరో సినిమా ప్రభాస్ తో చేయనున్నాడు అన్న టాక్ ఉంది, ఇప్పుడు ఆ టాక్ ని ఒకింత నిజం చేసేలా..

KGF నిర్మాతలు తమ అప్ కమింగ్ పాన్ ఇండియా మూవీ అనౌన్స్ మెంట్ ను డిసెంబర్ 2 న మధ్యాహ్నం 2 గంటల టైం లో రివీల్ చేయబోతుండగా అందరూ ఇది ప్రభాస్ తోనే అన్నట్లు డిసైడ్ అవుతున్నారు, సోషల్ మీడియా మొత్తం వినిపిస్తున్న వార్తలు కొందరు విశ్లేషకులు కూడా చెబుతూ ఉండటం తో ఇదే నిజం అయ్యే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు.

ప్రశాంత్ నీల్ ఫస్ట్ మూవీ ఉగ్రం ని తెలుగు రీమేక్ ప్రభాస్ తో చేస్తారు అన్న టాక్ కూడా ఉంది, మరి ఇందులో ఏది నిజం అవుతుందో తెలియదు కానీ ఏది నిజం అయినా కానీ ఆల్ ఇండియా లెవల్ లో వీళ్ళ కాంబినేషన్ మరో లెవల్ లో రచ్చ లేపడం మాత్రం ఖాయమని చెప్పొచ్చు.

Leave a Comment