గాసిప్స్ న్యూస్

ఒక్క అనౌన్స్ మెంట్ లో అల్టిమేట్ క్రేజ్…హీరో ఈ ముగ్గురిలో ఒకరా!

బాక్స్ ఆఫీస్ దగ్గర రెండేళ్ళ క్రితం డీసెంట్ అంచనాల నడుమ ఒరిజినల్ ని మెప్పించే రేంజ్ లో ఉంటుందా ఉండదా అనే డౌట్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన రాక్షసుడు సినిమా ఆడియన్స్ ని బాగా థ్రిల్ చేసింది. సినిమా ఒరిజినల్ తమిళ్ వర్షన్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో తెలుగు లో ఎలా ఉంటుందా అన్న ఆసక్తి ఉండగా ఒరిజినల్ ని ఏమాత్రం మార్చకుండా…

సీన్ బై సీన్ ఒరిజినల్ నే వాడేసిన డైరెక్టర్ రమేష్ వర్మ ఒరిజినల్ మ్యాజిక్ ని అలానే తెలుగు లో మెయిన్ టైన్ అయ్యేలా చేసి సక్సెస్ ను సొంతం చేసుకున్నాడు. కెరీర్ మొదలు పెట్టిన 5 ఏళ్లకి తొలి క్లీన్ హిట్ సినిమాను ఈ సినిమా తో సొంతం చేసుకున్నాడు బెల్లంకొండ.

ఇక ఈ సినిమా తర్వాత బుల్లి తెరపై కూడా అద్బుతమైన విజయాన్ని నమోదు చేసి టెలికాస్ట్ అయిన ప్రతీ సారి సాలిడ్ రేటింగ్ ను సొంతం చేసుకుని సత్తా చాటుకుంది. సైక్రో థ్రిల్లర్ సినిమానే అయినా ఈ రేంజ్ రేటింగ్స్ తో హోల్డ్ చేసిన ఫస్ట్ మూవీ అయ్యింది.

అలాంటి సినిమా కి ఒరిజినల్ లో కూడా ఇంకా సీక్వెల్ ఏమి ఉందని చెప్పలేదు కానీ తెలుగు లో మాత్రం ఈ సినిమా సీక్వెల్ ని రీసెంట్ గా డైరెక్టర్ రమేష్ వర్మ అనౌన్స్ చేసి అందరినీ థ్రిల్ చేశాడు. రాక్షసుడు 2 అంటూ టైటిల్ తో సినిమాను అనౌన్స్ చేసి ఈ సారి ఇందులో ఓ స్టార్ హీరో నటించబోతున్నాడు అంటూ త్వరలో మరిన్ని వివరాలు చేబుతామంటూ చెప్పారు.

స్టార్ హీరో అనడంతో ఎవరు నటిస్తారో అన్న ఆసక్తి ఆల్ రెడీ క్రియేట్ అవ్వగా ఓ ముగ్గురి పేర్లు ఇప్పుడు వినిపిస్తున్నాయి. రవితేజ, నితిన్ మరియు సీనియర్ హీరో నాగార్జున పేరు కూడా వినిపిస్తుంది. మరి ఈ ముగ్గురిలో ఒకరు కన్ఫాం అవుతారా లేక వీళ్ళు కాకుండా ఇంకా ఎవరైనా రేసులో నిలుస్తారో అన్నది త్వరలోనే తేలనుంది.

Leave a Comment