న్యూస్ బాక్స్ ఆఫీస్

ఒక్క వారంలో టాలీవుడ్ నంబర్ 1….సీటిమార్ మాస్…కానీ!!

బాక్స్ ఆఫీస్ దగ్గర సెకెండ్ వేవ్ తర్వాత ఆడియన్స్ ముందుకు వరుస పెట్టి సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ వాటిలో కొన్ని సినిమాలు మాత్రమె ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించగలిగాయి. వాటిలో ఒకటి అరా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు సాలిడ్ ఓపెనింగ్స్ తో మొదలై వర్కింగ్ డేస్ లో కొంచం స్లో అయినా స్టడీగా దూసుకు పోతున్న సీటిమార్ సినిమా…

బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కోసం మరింత కష్టపడాల్సిన అవసరం ఉండగా అదే టైం లో సినిమా టాలీవుడ్ తరుపునే కాదు ఇండియా లోనే సెకెండ్ పాండమిక్ తర్వాత బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచి సంచలనం సృష్టించింది… దాంతో పాటే ఇప్పుడు సినిమా టాలీవుడ్ తరుపున సెకెండ్ పాండమిక్ తర్వాత…

రిలీజ్ అయిన సినిమాల పరంగా హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని నంబర్ 1 మూవీ గా నిలిచింది, ఈ సినిమా బడ్జెట్ వేరు రిలీజ్ అయిన రేంజ్ వేరు.. ఈ సినిమా తో పోల్చితే చిన్న సినిమా అయిన SR కళ్యాణ మండపం సినిమా పాజిటివ్ టాక్ ఏమి సొంతం చేసుకోకున్నా కానీ…

బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి 8.2 కోట్ల లోపు షేర్ ని సొంతం చేసుకుని బిజినెస్ మీద సాలిడ్ ప్రాఫిట్ తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు సీటిమార్ సినిమా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు 8.67 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర…

ఓవరాల్ గా సాలిడ్ ఫస్ట్ వీక్ ని కంప్లీట్ చేసుకుంది… కానీ బ్రేక్ ఈవెన్ కి సినిమా ఇంకా చాలా మొత్తాన్ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది, SR కళ్యాణ మండపం ఫస్ట్ వీక్ తర్వాత మిగిలిన రన్ లో 1.3 కోట్ల షేర్ ని సాధించింది. కానీ సీటిమార్ సినిమా ఇంకా 3.3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాలి. మరి సినిమా ఎంతవరకు ఈ మొత్తాన్ని వెనక్కి రాబడుతుందో చూడాలి.

Leave a Comment