న్యూస్ బాక్స్ ఆఫీస్

ఒక్క సాంగ్ తో క్రేజ్…హిందీ డబ్బింగ్ రైట్స్ కి రికార్డ్ రేటు!

కొన్ని కొన్ని సార్లు సినిమాలోని ఒక్క పాట లేదా టీసర్ తో సినిమా పై క్రేజ్ పెరగడం మనం చూస్తూనే ఉన్నాం, అప్పటి వరకు సినిమా పై పెద్దగా బజ్ లేకున్నా కానీ ఒక్కసారి గా టీసర్ లేదా సాంగ్ రిలీజ్ అవ్వడం అల్టిమేట్ హిట్ అయ్యాక సినిమా పై క్రేజ్ భారీగా పెరిగి సినిమా కి మార్కెట్ లో మంచి డిమాండ్ వస్తుంది, లేటెస్ట్ గా కన్నడ మూవీ పొగరు…

విషయం లో ఇదే జరిగింది అని చెప్పాలి. హీరో ధృవ్ సీర్జ మరియు హీరోయిన్ రష్మిక ల కాంబినేషన్ లో రూపొందిన ఈ సినిమా టీసర్ ట్రైలర్ లు ఎప్పుడో రిలీజ్ అయినా కానీ ఒక్క సాంగ్ తో సినిమాపై హైప్ సాలిడ్ గా పెరిగి పోయింది అదే టైటిల్ కరాబు సాంగ్…

ఆ సాంగ్ అల్టిమేట్ హిట్ హైప్ చూసి తెలుగు లో కూడా సినిమాను డబ్ చేస్తూ ఉండగా ఇక్కడ రిలీజ్ అయిన సాంగ్ కి కూడా సూపర్బ్ రెస్పాన్స్ రాగా సినిమా కి ఉన్న మాస్ అప్పీల్ చూసి ఇప్పుడు హిందీ డబ్బింగ్ శాటిలైట్ రైట్స్ సాలిడ్ రేటుకి అమ్ముడు అయ్యాయి.

కన్నడ మూవీస్ లో KGF తప్పితే మరే సినిమా కూడా సాధించని రేంజ్ లో ఈ సినిమా కి అక్కడ హిందీ డబ్బింగ్ శాటిలైట్ రైట్స్ 7.2 కోట్ల రేటు సొంతం అయ్యింది, ఇది వరకు అక్కడ కన్నడ మూవీస్ లో మఫ్టీ మూవీ కి 3 కోట్లకు పైగా రేటు సొంతం అవ్వగా ఇప్పుడు ఆ రేటుకి..

డబుల్ మార్జిన్ తో ఈ రేంజ్ రేటు పలకడం తో సినిమా క్రేజ్ పవర్ అర్ధం చేసుకోవచ్చు, సినిమాను కన్నడ తో పాటు తెలుగు లో కూడా వచ్చే సంక్రాంతి కి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు, మరి సాంగ్ హిట్ అయినట్లు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రతాపం చూపుతుందో లేదో చూడాలి మరి.

Leave a Comment