న్యూస్

ఒక్క హిట్ కొట్టాడు….4 ఏళ్ళుగా రిలీజ్ ఆగిపోయిన సినిమా వచ్చేలా చేశాడు!

బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస ఫ్లాఫుల్లో ఉన్నా కానీ ఒక్క సినిమా హిట్ అయితే చాలు మళ్ళీ లెక్కలన్నీ నార్మల్ చేయోచ్చు. ఇప్పుడు ఇదే విధంగా వరుస ఫ్లాఫుల్లో 7 ఏళ్ళుగా ఒక్క హిట్ మూవీ కోసం ఎదురు చూస్తున్న మాచో మాన్ గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ సీటిమార్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడియన్స్ నుండి మంచి టాక్ ని సొంతం చేసుకుని మంచి వసూళ్ళతో దూసుకు పోతూ ఉండగా ఈ సినిమా…

హిట్ ఎఫెక్ట్ తో ఇప్పుడు గోపీచంద్ మార్కెట్ మళ్ళీ ఒకప్పటిలా మారడానికి సిద్ధం అవుతూ ఉండగా గోపీచంద్ అప్ కమింగ్ మూవీస్ కి ఇది చాలా మంచి న్యూస్ అనే చెప్పాలి. అదే టైం లో ఇప్పుడు గోపీచంద్ కెరీర్ లో ఎప్పుడో షూటింగ్ అయిపోయి రిలీజ్ డేట్స్ ని…

అనౌన్స్ చేసి ఎప్పటికప్పుడు రిలీజ్ కి సిద్ధం అయినా చివరి నిమిషంలో రిలీజ్ ఆగిపోయిన సినిమా గా ఎప్పుడో 4 ఏళ్ల క్రితమే ఆడియన్స్ ముందుకు రావాల్సిన ఆరడుగుల బుల్లెట్ సినిమా నిలుస్తుంది అని చెప్పాలి. ఈ సినిమా ఎప్పుడో ఆడియన్స్ ముందుకు రావాల్సింది కానీ ఎందుకో ప్రతీ సారి చివరి నిమిషంలో…

రిలీజ్ ను కాన్సిల్ చేసుకుంటూ 4 ఏళ్ళుగా రిలీజ్ నోచుకోలేక పోతున్న ఈ సినిమా లాస్ట్ ఇయర్ నుండి డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ చేయాలనీ ట్రై చేసినా కానీ ఒక్క మంచి ఆఫర్ రాకపోవడం తో సినిమా అక్కడ కూడా రిలీజ్ కి నోచుకోలేదు. ఈ ఇయర్ కూడా డైరెక్ట్ రిలీజ్ కి ట్రై చేసినా సెట్ కాలేదు… ఇలాంటి టైం లో ఇప్పుడు…

సీటిమార్ హిట్ టాక్ తో దూసుకు పోతూ ఉండటం తో ఇప్పుడు ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అక్టోబర్ నెలలో ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది అని కన్ఫాం చేశారు మేకర్స్… ఒక్క హిట్ తో 4 ఏళ్ళుగా రిలీజ్ కి నోచుకోని సినిమాను రిలీజ్ ను కన్ఫాం చేసేలా చేశాడు గోపీచంద్. మరి ఈ సినిమా ఎంతవరకు ఆడియన్స్ ను మెప్పిస్తుందో చూడాలి.

Leave a Comment