న్యూస్ ప్రీ రిలీజ్ బిజినెస్ బాక్స్ ఆఫీస్

ఒక్క హిట్ లేదు…అయినా మాస్ ఇది…మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బిజినెస్!!

అక్కినేని అఖిల్ బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ ని మొదలు పెట్టి ఆల్ మోస్ట్ 6 ఏళ్ళు కావోస్తున్నా కేవలం 3 సినిమాలు మాత్రమె ఇప్పటి వరకు చేయగా మూడు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ ప్రకారం నిరాశనే మిగిలించాయి. ఇలాంటి టైం లో బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో చేస్తున్న లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ఆడియన్స్ ముందుకు ఈ శుక్రవారం రిలీజ్ కాబోతుండగా సినిమా ఓవరాల్ గా సాధించిన…

ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క మాస్ అనిపించేలా ఉందని చెప్పాలి. మూడు సినిమాలు ఫ్లాఫ్ అయినా కానీ సాలిడ్ బిజినెస్ ను సొంతం చేసుకున్నాడు అఖిల్ మరోసారి.. అది కూడా క్లాస్ మూవీ తో సొంతం చేసుకోవడం విశేషం అనే చెప్పాలి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా…

మొత్తం మీద నైజాం ఏరియాలో 5.5 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకోగా సీడెడ్ ఏరియాలో 3 కోట్ల మేర బిజినెస్ ను సొంతం చేసుకుంది. ఇక ఆంధ్ర ఏరియాలో 9 కోట్ల మేర బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద ఇప్పుడు 17.5 కోట్ల బిజినెస్…

సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఇక మిగిలిన చోట్ల మరో కోటి బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 18.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. ఇక సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్, డబ్బింగ్ రైట్స్ వివరాలు క్లియర్ గా బయటికి రాలేదు. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు క్లీన్ హిట్ అవ్వాలి అంటే….

19 కోట్ల రేంజ్ లో షేర్ ని మినిమం వసూల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మూడు ఫ్లాఫ్స్ పడ్డా క్లాస్ మూవీ తో మాస్ బిజినెస్ ను సాధించిన అఖిల్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సారి కచ్చితంగా ఓ భారీ విజయాన్ని నమోదు చేస్తాడని అందరూ ఆశిస్తున్నారు. మరి అఖిల్ ఎంతవరకు అంచనాలను తట్టుకుని ఈ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రికవరీ చేస్తాడో చూడాలి.

Leave a Comment