గాసిప్స్ న్యూస్

ఒక్క హిట్ లేదు…8 ఏళ్ళుగా సినిమా లేదు…అయినా చిరు సినిమాకి మెహర్ రమేష్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

డైరెక్టర్స్ అందరూ సక్సెస్ అవ్వాలని రూల్ ఏమి లేదు కానీ ఛాన్సులు వరుస పెట్టి సొంతం చేసుకోవడం విషయంలో కొందరు డైరెక్టర్స్ ఫ్లాఫ్స్ ను సొంతం చేసుకున్నా కానీ ఛాన్సులు దక్కించుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి డైరెక్టర్స్ లో మెహర్ రమేష్ ఒకరు… కెరీర్ స్టార్టింగ్ లో చేసిన సినిమా చేసినట్లు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరచగా బిగ్ బడ్జెట్ మూవీస్ అయిన శక్తి మరియు షాడో లాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర…

భారీ డిసాస్టర్లుగా అలాగే భారీ నష్టాలను కూడా సొంతం చేసుకున్నాయి. అప్పటి నుండి కొత్త అవకాశాలను సొంతం చేసుకోవడంలో విఫలం అయిన మెహర్ రమేష్ ఆల్ మోస్ట్ 8 ఏళ్ల తర్వాత ఇప్పుడు కొత్త సినిమా ను సొంతం చేసుకున్నాడు. అది కూడా ఏకంగా మెగాస్టార్ తో…

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన అజిత్ కుమార్ వేదాలం సినిమా రీమేక్ గా తెరకేక్కుతుండగా ఈ సినిమా లో మెగాస్టార్ సిస్టర్ రోల్ లో కీర్తి సురేష్ నటించబోతుంది అన్న వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా కి గాను డైరెక్టర్…

మెహర్ రమేష్ ఒక్క హిట్ కూడా లేకుండా ఉన్నా 8 ఏళ్ళుగా ఒక్క మూవీ చేయకున్నా కానీ ఈ సినిమా కోసం ఆల్ మోస్ట్ హిట్స్ కొట్టిన డైరెక్టర్స్ రేంజ్ లో రెమ్యునరేషన్ ని సొంతం చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా అగ్రిమెంట్ టైం లో 10 లక్షలు అడ్వాన్స్ ఇవ్వగా సినిమా షూటింగ్ పూర్తీ అయ్యే టైం కి ఓవరాల్ గా రెమ్యునరేషన్ కింద…

1.5 కోట్ల దాకా రెమ్యునరేషన్ సొంతం చేసుకోబోతున్నారంటూ ట్రేడ్ లో టాక్ ఉంది. ఈ రేంజ్ రెమ్యునరేషన్ అంటే సాలిడ్ అనే చెప్పాలి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ చేయనుంది… ఇక ఈ సినిమా తో మెహర్ రమేష్ సాలిడ్ కంబ్యాక్ ని సొంతం చేసుకోవడం ఖాయమని చెప్పొచ్చు….

Leave a Comment