న్యూస్

ఒక పక్క కొమరం భీమ్ చరిత్ర సృష్టిస్తే…7 నెలల క్రితం వచ్చిన అల్లూరి సీతారామరాజు మరో రికార్డ్ కొట్టాడు!!

ఎస్ ఎస్ రాజమౌళి 2 మాస్ హీరోలతో చేస్తున్న సెన్సేషనల్ మూవీ ఆర్ ఆర్ ఆర్…. 7 నెలల క్రితం రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా సినిమా లో మొదటి ఇంట్రో టీసర్ ను రిలీజ్ చేయగా అల్టిమేట్ రెస్పాన్స్ రాగా కొన్ని అద్బుతమైన రికార్డులను ఆ ఇంట్రో టీసర్ సొంతం చేసుకుంది, ఇక రీసెంట్ గా 7 నెలల తర్వాత ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ రిలీజ్ అవ్వగా అన్ని రికార్డుల బెండు తీసి…

కొత్త రికార్డులతో సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ దూసుకు పోతూ టాలీవుడ్ తరుపున మొట్ట మొదటి 1 మిలియన్ లైక్స్ ని సొంతం చేసుకున్న టీసర్ గా అల్టిమేట్ రికార్డ్ ను నమోదు చేసింది… ఒక పక్క ఈ రికార్డుల వెల్లువ సాలిడ్ గా కొనసాగుతూ ఉంటే మరో పక్కా….

రీసెంట్ టైం లో రామ్ చరణ్ ఇంట్రో టీసర్ కి వ్యూస్ అండ్ లైక్స్ సాలిడ్ గా పెరిగాయి…. కొమరం భీమ్ ఇంట్రో టీసర్ కి ముందు 26 మిలియన్స్ అండ్ 6 లక్షల 50 వేల రేంజ్ లైక్స్ ని సొంతం చేసుకున్న ఈ ఇంట్రో టీసర్ తర్వాత ఒక్కసారిగా వ్యూస్ అండ్ లైక్స్ ని పెంచుకుంటూ దూసుకు పోతుంది.

కొత్త టీసర్ హైప్ వలన అందరూ మరోసారి పాత టీసర్ ను చూడటం, అప్పుడు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడు లైక్ చేయడం లాంటివి చేస్తూ వెళ్ళడంతో మొదటి 7 లక్షల లైక్స్ ని అందుకున్న టీసర్ గా నిలిచిన ఈ ఇంట్రో టీసర్ ఇప్పుడు కొమరం భీమ్ ఇంట్రో టీసర్ తర్వాత 8 లక్షల లైక్స్ ని అందుకున్న….

రెండో ఇంట్రో టీసర్ గా నిలిచి సంచలనం సృష్టించింది. ఈ క్రమం లాస్ట్ 6 – 7 రోజుల్లోనే ఇంట్రో టీసర్ కి 6 మిలియన్స్ కి పైగా వ్యూస్ దక్కడం మరో విశేషం అని చెప్పాలి. 2 టీసర్లను కంపేర్ చేయడం, లేదా ఒక టీసర్ చూసిన వాళ్ళు మరో టీసర్ చూడటం తో రెండూ కూడా అద్బుతాలు సృష్టిస్తూ సినిమా పై ఉన్న క్రేజ్ పవర్ ఏంటో తెలియజేస్తున్నాయి.

Leave a Comment