గాసిప్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

ఒక బ్లాక్ బస్టర్…3 చోట్ల రీమేక్!!

  ఒక భాషలో హిట్ అయిన సినిమా లు ఇతర భాషల్లో రీమేక్ అవ్వడం అన్నది సర్వ సాధారణ మైన విషయం అని చెప్పొచ్చు. మన తెలుగు లో హిట్ అయిన సినిమాలు ఎన్నో ఇతర భాషల్లో రీమేక్ అయ్యాయి, అలాగే ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలు కూడా ఇక్కడ రీమేక్ అయ్యాయి. అందులో ఆసక్తి కరమైన విషయం ఏంటి అంటే… కొన్ని సార్లు ఒక భాషలో హిట్ అయిన సినిమాల రీమేక్ ల విషయం లో…

ఇతర ఇండస్ట్రీ ల నుండి రైట్స్ కొన్న వాళ్ళు రీమేక్ అయిన మొదటి భాషలో వచ్చే రిజల్ట్ ని బట్టి రీమేక్ చేయాలో వద్దో అన్న ఆలోచన లో ఉంటారు. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఒకే సారి అన్ని భాషల్లో కి అతి తక్కువ గ్యాప్ లో రీమేక్ అవుతూ ఉంటాయి.

ఇప్పుడు ఈ కోవ లోకే వస్తుంది లేటెస్ట్ గా మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యపనం కోశియం అనే సినిమా. బిజు మీనన్ పృద్వీరాజ్ ల కాంబో లో వచ్చిన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అవ్వడం తో ఇతర భాషల్లో రీమేక్ కి మంచి ఆఫర్స్ వచ్చాయి.

కాగా ప్రస్తుతం లాక్ డౌన్ వలన పనులు వెంటనే మొదలు అవ్వడం లేదు కానీ లేకుంటే ఈ పాటికే ఈ సినిమా రీమేక్ తెలుగు, హిందీ మరియు తమిళ్ లో మొదలు అయ్యి ఉండేది, ఇంకా తెలుగు వర్షన్ లో ఎవరు ఉన్నారు అన్నది కన్ఫాం కాలేదు కానీ… తమిళ్ లో శశి కుమార్ మరియు ఆర్య ల కాంబో లో రీమేక్ కానుంది.

ఇక హిందీ లో జాన్ అబ్రహం పృద్వీరాజ్ రోల్ లో కన్ఫాం అవ్వగా మరో రోల్ త్వరలో తేలనుంది, తెలుగు లో కూడా త్వరలో స్టార్ కాస్ట్ కన్ఫాం కానున్న ఈ సినిమా లాక్ డౌన్ తర్వాత దాదాపు మూడు భాషల్లో కూడా రీమేక్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది, కానీ ముందు ఏ భాషలో రిలీజ్ అవుతుందో చూడాలి.

Leave a Comment