న్యూస్

ఒక యూట్యూబర్ కి 500 కోట్ల ఫైన్ వేసిన అక్షయ్ కుమార్…కారణం ఇదే!!

బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ కి కోపం వచ్చింది, సెలెబ్రిటీల పై రూమర్స్ వస్తూ ఉండటం కామనే, కానీ చనిపోయిన ఒక యాక్టర్ తో తనకి లింక్ ఉంది అంటూ వరుసగా అసత్య ప్రచారాలు చేస్తూ ఉండటం తో చూస్తూ ఉండిపోయిన అక్షయ్ కుమార్, ఇక ఓపిక నశించి ఇప్పుడు ఒక యూట్యూబర్ పై ఏకంగా 500 కోట్ల పరువు నష్టం దావా వేసి ఇండియా మొత్తానికి భారీ షాక్ ఇచ్చాడు ఇప్పుడు..

వివరాల్లోకి వెళితే, అక్షయ్ కుమార్ లేటెస్ట్ మూవీ పై నెగటివిటీ భారీగా పెరగడానికి కారణం సుశాంత్ కి అక్షయ్ అన్యాయం చేశాడు అంటూ వార్తలు రావడమే, సుశాంత్ కి రావాల్సిన కొన్ని అవకాశాలను అక్షయ్ తన సొంతం చేసుకున్నాడు అంటూ అనేక రూమర్స్ ఉన్నాయి.

దాంతో వాటినే మరింత బలంగా చెబుతూ కొన్ని ఛానెల్స్ అండ్ యూట్యూబ్ ఛానల్స్ కూడా వరుసగా వీడియోలు చేస్తూ రాగా రషీద్ సిద్దిఖి అనే బిహార్ వ్యక్తీ తన యూట్యూబ్ ఛానెల్ లో ఏకంగా అక్షయ్ కుమార్ సుశాంత్ కేసులో కీలక వ్యక్తీగా చెప్పుకునే హీరోయిన్ రియా చక్రవర్తి సుశాంత్ మరణం తర్వాత…

కెనడా పారిపోవడానికి అక్షయ్ సహాయం చేశాడు అంటూ నోటికొచ్చిన మాటలు అన్నీ మాట్లాడాడట. అంతే కాకుండా సుశాంత్ చేసిన MS ధోని దక్కించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు అని, ఇక సుశాంత్ చనిపోయిన టైం లో ముంబై పోలీసులతో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారని అనేక కథనాలు చెప్పి వాటి ద్వారా వ్యూస్ ని సొంతం చేసుకుని ఈ మధ్య కాలంలోనే ఏకంగా…

15 లక్షల దాకా సంపాదించాడట… అందులో తనపై చేసిన కామెంట్స్ వీడియో ఏకంగా అక్షయ్ కుమార్ దాకా వెళ్ళడంతో వీటికి ఎలాగైనా పులిస్టాప్ పెట్టాలని ఫిక్స్ అయిన అక్షయ్ కుమార్ ఈ యూట్యూబర్ పై ఏకంగా 500 కోట్ల పరువు నష్టం దావా వేసి షాక్ ఇచ్చాడు ఇప్పుడు. దాంతో ఇప్పుడు ఈ కేసులో తర్వాత ఏమవుతుందో మరి చూడాల్సిందే.

Leave a Comment