న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

ఒక సినిమా 4 కోట్లతో 64 కోట్లు…ఇంకో సినిమా 50 కోట్లతో ఒక కోటి…ఎపిక్ మైండ్ బ్లాక్ ఇది!!

బాక్స్ ఆఫీస్ దగ్గర కొన్ని సినిమాలు అంచనాలను మించి పెర్ఫార్మ్ చేస్తాయి, కొన్ని సినిమాలకు అవసరం ఉన్నా కానీ అలా పెర్ఫార్మ్ చేయవు, చాలా వరకు సినిమాలు టాక్ మీదే డిపెండ్ అయ్యి ఉంటాయి కానీ రిలీజ్ టైం అండ్ సినిమా హైప్ కూడా చాలా ముఖ్యం, రీసెంట్ గా కేవలం 1 వారం గ్యాప్ లో రిలీజ్ అయిన 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర కంప్లీట్ రివర్స్ రిజల్ట్ లను సొంతం చేసుకుని శాకిచ్చాయి…

ఆ సినిమాలే ఒకటి జాతిరత్నాలు మరోటి మోసగాళ్ళు… ఒకటి చాలా చిన్న బడ్జెట్ మూవీ మరోటి పెద్ద హీరోల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా. రెండు సినిమాలకు నిజానికి కంప్లీట్ డిఫెరెంట్ రిజల్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర రావాలి కానీ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ రన్ ను…

కంప్లీట్ చేసుకునే టైం కి ఊహకందని నంబర్స్ ను నమోదు చేశాయి. ముందుగా జాతిరత్నాలు సినిమా విషయానికి వస్తే కేవలం 4 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా టోటల్ రన్ లో ఏకంగా 64 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుని ఊహకందని మాస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

తెలుగు సినిమా చరిత్ర లోనే చిన్న సినిమాల్లో ఎపిక్ విజయాన్ని సాధించిన మూవీస్ లో ఒకటిగా నిలిచింది, అదే టైం లో వారం గ్యాప్ లో వచ్చిన మంచు విష్ణు కాజల్ అగర్వాల్ ల కాంబినేషన్ లో వచ్చిన మోసగాళ్ళు మూవీ ఏకంగా 50 కోట్ల బడ్జెట్ లో రూపొందించగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి…

కేవలం 1 కోటి రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఏకంగా 49 కోట్ల నష్టాన్ని దక్కించుకుంది. తెలుగు సినిమా చరిత్ర లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లాస్ వెంచర్ మూవీస్ లో ఈ సినిమా ఒకటిగా చేరింది. ఇలా కేవలం వారం గ్యాప్ లో 2 సినిమాలు కంప్లీట్ గా డిఫెరెంట్ రేంజ్ రిజల్ట్ ను సొంతం చేసుకుని చరిత్రకెక్కాయి అని చెప్పొచ్చు.

Leave a Comment