న్యూస్ రివ్యూ

ఒరేయ్ బుజ్జిగా ట్రైలర్ రివ్యూ….బాగుంది ట్రైలర్!

బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ మొదలు పెట్టడం వరుస విజయాలతో మొదలు పెట్టినా కానీ తర్వాత అనుకున్న రేంజ్ విజయాలు లేక ఒకటి తర్వాత ఒకటి ఫ్లాఫ్స్ ని సొంతం చేసుకుంటూ వెళుతున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ రీసెంట్ టైం లో తన మార్కెట్ కోల్పోయే స్టేజ్ కి వచ్చాడు. కెరీర్ స్టార్టింగ్ లో మినిమం గ్యారెంటీ హీరో లా పేరు తెచ్చుకున్నా తర్వాత పరాజయాలు ఎక్కువ అవ్వడం తో….

మార్కెట్ పూర్తిగా డౌన్ అయిన టైం లో ఇప్పుడు గుండె జారి గల్లంతైందే, ఒక లైలా కోసం ఫేం విజయ్ కుమార్ కొండ డైరెక్షన్ లో ఒరేయ్ బుజ్జిగా సినిమా చేస్తుండగా సినిమా ముందు సమ్మర్ రేసు లో నిలిచినా కరోనా వల్ల పోస్ట్ పోన్ అవ్వగా సినిమా ఇప్పుడు…..

డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ను అక్టోబర్ 2 న ఆహా యాప్ లో సొంతం చేసుకోబోతుండగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని రీసెంట్ గా లాంచ్ చేయగా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది, ట్రై యాంగిల్ లవ్ స్టొరీ గా తెరకెక్కిన సినిమా లో మంచి కామెడీ ఎలిమెంట్స్ ఉన్నాయి అని…

ట్రైలర్ లో తెలుస్తుండగా కథ పాయింట్ ని పూర్తిగా చెప్పుకున్నా మంచి ఎంటర్ టైన్ మెంట్ ఎలిమెంట్స్ తో నిండిన ట్రైలర్ బాగానే మెప్పించింది అని చెప్పాలి. సాంగ్స్ తో మెప్పించిన అనూప్ రూబెన్స్ బ్యాగ్రౌండ్ స్కోర్ విషయం లో మాత్రం పెద్దగా ఇంపాక్ట్ ని అయితే చూపలేదు అనే చెప్పాలి. ట్రైలర్ కి బ్యాగ్రౌండ్ స్కోర్ మైనస్ గా నిలిచింది.

కానీ స్టార్ కాస్ట్ బాగా ఉండటం సినిమా రిచ్ గా ఉండటం తో సినిమా మెప్పించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఉంటె ఎలా ఉండేదో కానీ డైరెక్ట్ రిలీజ్ వలన పెద్దగా ఇబ్బందులు ఏమి ఉండవనే చెప్పాలి. ఇక సినిమా తో రాజ్ తరుణ్ ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి.

Leave a Comment