గాసిప్స్ న్యూస్

ఓరినీ…అల్లరి నరేష్ సినిమా ఫ్రీమేకే…30 రోజుల్లో ప్రేమించడం ఎలా???

టాలీవుడ్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా అమృతా అయ్యర్ హీరోయిన్ గా రూపొందుతున్న సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా.. ఎప్పుడో లాస్ట్ ఇయర్ సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా వలన రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వగా డిజిటల్ రిలీజ్ కి మంచి ఆఫర్లు వచ్చినా కానీ నో చెబుతూ రాగా రేటు కూడా పడిపోయిన టైం లో సినిమా అనుకోకుండా ఇప్పుడు…

తిరిగి బాక్స్ ఆఫీస్ బరిలో నిలిచి ఈ నెల 29 న రిలీజ్ ను సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతుండగా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. కాగా ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తూ ఉండగా ట్రైలర్ చూసిన తర్వాత ఇది పునర్జన్మల నేపధ్యంతో…

తెరకెక్కుతున్న సినిమా అని కన్ఫాం అయిపొయింది. దాంతో పాటు ఈ సినిమా ఒకప్పుడు అల్లరి నరేష్ చేసిన “ప్రాణం” అనే సినిమా కాన్సెప్ట్ తో ఫ్రెష్ ట్రీట్ మెంట్ తో రూపొందుతున్న సినిమా అని ఇండస్ట్రీలో సోషల్ మీడియా లో చర్చ జరుగుతుంది. అల్లరి నరేష్ సదాల కాంబోలో…

వచ్చిన ప్రాణం సినిమా లో కూడా పూర్వ జన్మలో ప్రేమికులు ఒక ఇంసిడెంట్ వలన చనిపోయి తిరిగి మళ్ళీ పుడతారు, వారు ఎలా ప్రేమించుకున్నారు, వాళ్ళ పూర్వ జన్మ గురించి ఎలా తెలుసుకున్నారు, తర్వాత ఏమైంది, లాంటివి అచ్చూ ఆ సినిమాలో కూడా ఉంటాయి. తర్వాత మగధీర కూడా వచ్చినా ఆ సినిమా యుద్ధ కాన్సెప్ట్ తో మరోలా ట్రీట్ చేశారు. ఈ సినిమా బడ్జెట్ వేరు కాబట్టి…

ప్రాణం సినిమానే ఫ్రీమేక్ గా చేశారు అంటూ సోషల్ మీడియా లో మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. ట్రైలర్ మట్టుకు అయితే అలానే అనిపిస్తుంది మరి. ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఇదే నిజం అవుతుందో ఏమో చూడాలి ఇక. ఈ నెల 29న సినిమా తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది.

Leave a Comment