గాసిప్స్ న్యూస్

ఓరినీ ఉప్పెన సినిమా ఫస్ట్ వెళ్ళింది ఈ హీరో…అసలు ఎలా సెట్ అవుతుంది!

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ ఊహకందని విజయాన్ని నమోదు చేసిన సినిమాల్లో ఉప్పెన సినిమా ముందు నిలిచే సినిమా అని చెప్పాలి. లాస్ట్ ఇయరే ఆడియన్స్ ముందుకు రావాల్సిన ఈ సినిమా అప్పటి ఫస్ట్ వేవ్ ఎఫెక్ట్ వలన రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉండగా డిజిటల్ లో రిలీజ్ చేయాలనీ ట్రై చేసినా సినిమా బడ్జెట్ కి సరిపోని ఆఫర్స్ రావడం తో సినిమాను థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలనీ…

డిసైడ్ అవ్వగా ఈ ఇయర్ ఫిబ్రవరి లో రిలీజ్ చేయగా అల్టిమేట్ బజ్ ను సొంతం చేసుకుని రిలీజ్ టైం లో ఆల్ మోస్ట్ ఒక స్టార్ హీరో సినిమా రేంజ్ లో సాలిడ్ క్రేజ్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఉప్పెన సినిమా…

బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊచకోత కోసింది. ఈ సినిమా తో ఇండియన్ హిస్టరీలోనే డెబ్యూ మూవీ తో రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న రికార్డ్ కూడా దక్కింది. అలాంటి రికార్డ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ముందుగా వెళ్ళింది పంజా వైష్ణవ్ తేజ్ దగ్గరకు కాదు….

ఈ కథని బుచ్చిబాబు సనా ముందుగా యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ దగ్గరకి తీసుకు వెళ్లి కథ వినిపించగా కథ అంతా నచ్చినా కానీ క్లైమాక్స్ విషయంలో కొన్ని అభ్యంతరాలు చెప్పిన విజయ్ దేవరకొండ ఆ కాన్సెప్ట్ ని మార్చగలరా అని అడగడం కథకి అదే కీలకం అవ్వడం తో తర్వాత సినిమాను వద్దూ అనుకోవడం జరిగిందట…

తర్వాత మెగా ఫ్యామిలీ నుండి హీరోగా లాంచ్ అవ్వడానికి సిద్ధం అయిన పంజా వైష్ణవ్ తేజ్ లాంచ్ కోసం ఈ కథని వినిపించడం అది చిరుకి నచ్చడం తో ఈ సినిమా వైష్ణవ్ తేజ్ లాంచ్ మూవీ అయ్యింది. ఒకవేళ విజయ్ దేవరకొండ చేసి ఉంటె ఆ క్లైమాక్స్ కి రిజల్ట్ వేరేలా ఆడియన్స్ రిసీవ్ చేసుకుని ఉండేవాళ్ళు. కొత్త హీరో కాబట్టి అలా వర్కౌట్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ గా నిలిచింది ఈ సినిమా..

Leave a Comment