గాసిప్స్ న్యూస్

ఓరినీ….చావు కబురు చల్లగా కథ కూడా కాపీ కొట్టారా…ఎక్కడ నుండి కాపీ కొట్టారంటే!!

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో రీసెంట్ గా యంగ్ హీరో కార్తికేయ హీరోగా లావణ్య త్రిపాటి హీరోయిన్ గా ఆమని ముఖ్య పాత్రలో రూపొందిన సినిమా చావు కబురు చల్లగా, డిఫెరెంట్ కాన్సెప్ట్ అంటూ ఒక స్వర్గపురి రధం నడిపే హీరో కి భర్త చనిపోయిన నర్స్ కి మధ్య లవ్ స్టొరీ గా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ను మరీ అనుకున్న లెవల్ లో అలరించ లేక పోతుంది, కానీ….

ఉన్నంతలో ఒక డిఫెరెంట్ అటెంప్ట్ గా ఆడియన్స్ చెప్పుకుంటున్న టైం లో ఈ సినిమా కథ పాయింట్ ని కాపీ కొట్టి సినిమా తీశారు అంటూ సోషల్ మీడియా లో కొన్ని ట్రోల్స్ వినిపిస్తున్నాయి. అవి ఎంతవరకు నిజం అన్నది ఇక యూనిట్ కే తెలియాలి కానీ..

సోషల్ మీడియా లో వినిపిస్తున్న టాక్ ప్రకారం సినిమా స్టొరీ పాయింట్ ని లాస్ట్ ఇయర్ లో తెలుగు లో వచ్చిన నివాసి అనే ఒక షార్ట్ ఫిల్మ్ నుండి తీసుకున్నారని అంటున్నారు. అందులో కూడా హీరో.. హీరోయిన్ ని స్మశాన వాటికలోనే చూసి ప్రేమిస్తాడు. ఇక ఈ షార్ట్ ఫిల్మ్ లో..

హీరో కాటికాపరి కొడుకు. స్మశానంలోనే ఇల్లు కట్టుకొని ఉంటారు. చావు కబురు చల్లగా సినిమాలో తల్లి పాత్ర కొడుకుతో కలిసి మందు తాగుతుంది, ఈ షార్ట్ ఫిల్మ్ లో కూడా అలానే ఉంటుంది. ఇలా షార్ట్ ఫిల్మ్ లో అనేక సీన్స్ సినిమాలారిటీ గా ఉండటం తో మెయిన్ కథ పాయింట్ ని ఈ షార్ట్ ఫిల్మ్ నుండే తీసుకున్నారు అంటూ సోషల్ మీడియా లో ట్రోల్స్ వినిపిస్తున్నాయి.

మొత్తం మీద కాపీ కథ అయినా ఆడియన్స్ ను మరీ కనెక్ట్ అయ్యేలా సినిమాను రూపొందించలేక పోయారు, సినిమా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో రూపొందిన అన్ని సినిమాలలోకి వీక్ టాక్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది, ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.

Leave a Comment