గాసిప్స్ న్యూస్

ఓరినీ రేటు పెరుగుతూనే ఉందిగా….ఈ సారి నాగ చైతన్య ఎంటర్ అయ్యాడు!!

ప్రజెంట్ క్రేజ్ ని బట్టి OTT యాప్స్ సినిమాలకు రేట్లు ఆఫర్ చేస్తున్నాయి అని చెప్పాలి. ఇది వరకు సమ్మర్ రిలీజ్ అనుకున్న సినిమాలకు అప్పటి నుండే రేట్లు ఆఫర్ చేస్తూ వస్తూ ఉండగా ఆ సినిమాలు స్పందించక పోవడం తో కొన్ని సార్లు ట్రై చేసి ఊరుకోగా ఇప్పుడు మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టి ఎండింగ్ కి దగ్గరగా ఉన్న సినిమాలను ట్రై చేసుకుంటున్నాయి OTT యాప్స్ అన్నీ కూడా..

అందులో భాగంగా ప్రజెంట్ హాట్ కేక్ లా ఉన్న సినిమాలలో నాగ చైతన్య మరియు సాయి పల్లవి ల కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న లవ్ స్టొరీ సినిమా ఒకటి. సాలిడ్ క్రేజ్ నడుమ రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ తో మళ్ళీ కొత్త రిలీజ్ డేట్ ను వెతుక్కునే పనిలో ఉండగా…

లాస్ట్ ఇయర్ సినిమా ను డిజిటల్ రిలీజ్ కి తెగ ట్రై చేశారు కానీ మేకర్స్ నో చెబుతూ రాగా ఈ ఇయర్ సెకెండ్ వేవ్ లో కూడా ఈ సినిమా కోసం ట్రై చేస్తూనే ఉన్నారు… ముందు 40 కోట్ల ఆఫర్ రాగా ఆ ఆఫర్ ని అసలు పట్టించుకోలేదు, తర్వాత అమెజాన్ ప్రైమ్ ఏకంగా 45 కోట్ల ఆఫర్ తో బరిలోకి దిగింది..

దానికి నిర్మాతలు నో చెప్పగా మళ్ళీ అమెజాన్ ప్రైమ్ ఏకంగా 50 కోట్ల రేటు తో యూనిట్ ని అప్రోచ్ అయిందని లేటెస్ట్ ట్రేడ్ టాక్. ఈ సారి ఆఫర్ మరింత పెరగడంతో నిర్మాత కొద్దిగా టెంప్ట్ అయినా కానీ విషయం హీరో నాగ చైతన్య కి కూడా తెలిసి సీన్ లోకి ఎంటర్ అయ్యి… ఎట్టి పరిస్థితులలో సినిమా డిజిటల్ రిలీజ్ అవ్వదని…

క్లియర్ గా చెప్పేశాడట… దాంతో మేకర్స్ కూడా సినిమా కి మంచి డేట్ ని సెట్ చేసే పనిలో ఉన్నారు, సారంగ దరియా సాంగ్ అల్టిమేట్ హిట్ తో సినిమా పై క్రేజ్ భారీగా పెరిగింది. టాక్ బాగుంటే 50 కోట్లు అవలీలగా దాటేసి నాగ చైతన్య కెరీర్ లోనే కొత్త రికార్డులు నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉంది ఈ సినిమా కి అని చెప్పొచ్చు.

Leave a Comment