న్యూస్ బాక్స్ ఆఫీస్

ఓ బేబీ కలెక్షన్స్: అమ్మింది 10 కోట్లు….3 రోజుల్లో వచ్చింది ఇది!!

సమంత అక్కినేని హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఓ బేబీ… ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా కి తొలి ఆటకే మంచి పాజిటివ్ టాక్ లభించింది, సెకెండ్ ఆఫ్ సెంటిమెంట్ డోస్ కొంచం ఎక్కువగా ఉందని కంప్లైంట్ వచ్చినా కానీ ఆడియన్స్ సినిమా కి మొదటి వీకెండ్ లో బ్రహ్మరధం పట్టారు.

 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు రెండు రాష్ట్రాలలో 1.45 కోట్ల షేర్ ని రెండో రోజు 1.15 కోట్ల షేర్ ని అందుకోగా మూడో రోజు దుమ్ము లేపి మొదటి రెండు రోజుల కలెక్షన్స్ కలిపే లెవల్ లో 2.6 కోట్ల షేర్ ని అందుకుంది. టోటల్ గా 3 రోజుల్లో రెండు రాష్ట్రాలలో 5.21 కోట్ల షేర్ ని అందుకుంది.

ఇక వరల్డ్ వైడ్ గా 3 రోజుల్లో 8.16 కోట్ల షేర్ ని సాధించింది. టోటల్ గ్రాస్ 13 కోట్లకు పైగా ఉందని సమాచారం… సినిమాను 10 కోట్ల కి అమ్మగా 11 కోట్ల టార్గెట్ ని అందుకోవడానికి ఓ బేబీ మరో 2.84 కోట్ల షేర్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది. మొదటి వీక్ పూర్తి అయ్యే సరికి ఈ మార్క్ ని అందుకునే చాన్స్ ఉందని చెప్పొచ్చు.

Leave a Comment