న్యూస్ ప్రీ రిలీజ్ బిజినెస్ బాక్స్ ఆఫీస్

కన్నడ గడ్డపై మహర్షి పంజా… కెరీర్ బెస్ట్ రికార్డ్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ప్రతిష్టాత్మక 25 వ సినిమా మహర్షి, శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ సినిమా మే 9 న భారీ ఎత్తున రిలీజ్ కాబోతుండగా సినిమా బిజినెస్ పరంగా ఇప్పటి నుండే దుమ్ము లేపుతుంది, ముందుగా ఓవర్సీస్ లో భారీ రేటు డీల్ జరుగుతుండగా ఇప్పుడు పక్క రాష్ట్రం కర్ణాటక లో కూడా సినిమా బిజినెస్ భారీ గా జరుగుతుందని సమాచారం. సినిమా కి అక్కడ నుండి…

భారీ ఆఫర్స్ వస్తుండగా నిర్మాతలు ముందు గా 10 కోట్ల రేంజ్ లో బిజినెస్ ఎక్స్ పెర్ట్ చేసినా ఫైనల్ గా బిజినెస్ 8.5 కోట్ల రేంజ్ లో ఫైనల్ అయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అని చెప్పాలి, ఇదే ఫైనల్ అయితే మహేష్ కెరీర్ లో ఇది రికార్డ్ అనే చెప్పాలి.

స్పైడర్ సినిమా తెలుగు తమిళ్ రెండు కలిపి అక్కడ 10 కోట్లకు పైగా బిజినెస్ ని సొంతం చేసుకుంది, అందులో తెలుగు వర్షన్ సుమారు 7 కోట్ల రేంజ్ లో ఉందని సమాచారం, ఇక రీసెంట్ మూవీ భరత్ అనే నేను మూవీ అక్కడ ఓవరాల్ గా 8.2 కోట్ల రేంజ్ లో బిజినెస్ ని సాధించి…

కర్ణాటక లో మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ బిజినెస్ సాధించిన సినిమా గా నిలిచింది, కానీ ఇప్పుడు ప్రతిష్టాత్మక 25 వ సినిమా అయిన మహర్షి సినిమా అక్కడ 8.5 కోట్ల రేంజ్ లో బిజినెస్ ని సాధించి కెరీర్ బెస్ట్ రికార్డ్ ను కొట్టే చాన్స్ ఎక్కువగా ఉందని తెలుస్తుంది.

మహేష్ బాబు సరసన పూజా హెడ్గే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కి వంశీ పైడిపల్లి డైరెక్టర్ గా పని చేస్తుండగా ముగ్గురు నిర్మాతలు సినిమాను నిర్మిస్తున్నారు. ఇక మే 9 న సినిమా బాక్స్ ఆఫీస్ బరిలో ఎలాంటి రికార్డులను నమోదు చేస్తుందో చూడాలి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!