గాసిప్స్ న్యూస్

కమల్ హాసన్ “విక్రం”కి తెలుగులో సాలిడ్ రేటు…హిట్ లేక ఏళ్ళు అయినా క్రేజ్ తగ్గలేదు!

లోక నాయకుడు కమల్ హాసన్ కి ఈ మధ్య కాలంలో పెద్దగా సక్సెస్ ఏమి లేదనే చెప్పాలి, తమిళ్ లో విశ్వరూపం పార్ట్ 1 హిట్ తర్వాత దృశ్యం రీమేక్ పాపనాశం సినిమా హిట్ అయినా మిగిలిన సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ అయ్యాయి. తెలుగు లో విశ్వరూపం కూడా యావరేజ్ గానే ఆడగా అంతకన్నా ముందు ఎప్పుడో వచ్చిన దశావతారం మాత్రమే పర్వాలేదు అనిపించే రిజల్ట్ ను సొంతం చేసుకుంది.

అయినా కానీ కమల్ హాసన్ మూవీస్ అంటే తెలుగు లో టాక్ కి అతీతంగానే బిజినెస్ ఆఫర్స్ వస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా. కమల్ హాసన్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ఒకటి ఇండియన్ 2 మరోటి విక్రం. శంకర్ డైరెక్షన్ లో మొదలు పెట్టి మధ్యలో ఆగిపోయిన…

ఇండియన్ 2 కచ్చితంగా కమల్ హాసన్ కి ఓ రేంజ్ లో కంబ్యాక్ మూవీ అవుతుంది అనుకున్నా మధ్యలో ఆగిపోవడం తో కొత్త సినిమాను కమిట్ అవ్వడం మొదలు పెట్టిన కమల్ ఖైదీ, మాస్టర్ సినిమాల డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో విక్రమ్ అనే సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే…

ఈ సినిమా లో కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి మరియు ఫహాద్ ఫాజిల్ కూడా నటిస్తున్నారు. దాంతో సినిమా పై ఇప్పటి నుండే మంచి హైప్ మొదలు అవ్వగా సినిమా ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా రిలీజ్ చేయగా మీమ్స్ తో ఓ రేంజ్ లో రీచ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా కి తెలుగు డబ్ వర్షన్ కోసం బిజినెస్ ఆఫర్స్…

ఇప్పటి నుండే జోరు అందుకున్నయట. తెలుగు లో ఈ సినిమా కోసం 12-14 కోట్ల రేంజ్ రేటు ఆఫర్ చేస్తున్నారని సమాచారం. ఫ్లాఫ్స్ లో ఉన్న కమల్ పై ఈ రేంజ్ రేటు పెట్టడానికి కూడా సిద్ధం అవుతున్నారు అంటే సినిమా క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు. కానీ మేకర్స్ సినిమా బిజినెస్ కి ఇంకా టైం ఉందని పూర్తీ అయ్యే టైం కి బిజినెస్ ను మొదలు పెడతారని సమాచారం. మరి ఈ సినిమా తో అయినా కమల్ హాసన్ సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం…

Leave a Comment